China dream city: చైనాలో ఉన్న జనాభాకు ఎన్ని ఇళ్లు కట్టినా సరిపోకూడదు.కానీ అక్కడ ఓ భారీ నగరం మొత్తం ఖాళీగా ఉంది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్..బీజింగ్ వెలుపల 60 మైళ్ల దూరంలో ఉన్న జియోంగాన్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించారు. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ నేతృత్వంలోని $93 బిలియన్ల ఖర్చుతో దీన్ని నిర్మింప చేశారు. బిజీగా మారిపోయిన బీజింగ్ కు ప్రత్యామ్నాయంగా ఆ సిటీని నిర్మించారు. ఏడేళ్లలోనే న్యూయార్క్ కన్నా అతి పెద్ద సిటీని నిర్మించారు. కానీ ఇప్పటికీ అది ఖాళీగానే ఉంది. దానికి భవిష్యత్ ఉందో లేదో తెలియని పరిస్థితి.
జియోంగాన్‌ను అగ్రశ్రేణి పరిశ్రమలు, ప్రభుత్వ నిర్వహణ సంస్థలు , లక్షలాది నివాసితులను ఆకర్షించే ఆధునిక సోషలిస్ట్ మహానగరంగా తీర్చిద్దారు. ఒకప్పుడు వ్యవసాయ భూములు , చిత్తడి నేలలతో ఈ ప్రాంతం ఉండేది. ఈ నగరాన్ని ఏడేళ్లలోనే తీర్చిదిద్దారు విశాలమైన నివాస సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, రోజుకు 100,000 మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించే అతి పెద్ద రైల్వేస్టేషన్ ను కూడా నిర్మించారు. నగరం అద్భుతంగా ఉటుంది. కానీ అక్కడ ఉండేవారు లేరు. గతంలో అక్కడ భూములు స్వాధీనం చేసుకున్నప్పుడు వారికి వచ్చిన వాటా కింద భవనాలు కేటాయించారు. వాటిలో మాత్రం కొంత మంది ఉంటున్నారు. మిగతా ఎవరూ అక్కడ ఉండేందుకు ఆసక్తి చూపించడం లేదు.
జియోంగాన్ ను అభివృద్ధి చేయాడనికి గ్రామాలను నేలమట్టం చేశారు. వేలాది మంది నిర్వాసితులయ్యారు.అయితే వారికి భారీగా పరిహారం చెల్లించారు. 2023లో వినాశకరమైన వరదలు వచ్చాయి. ఆ సమయంలో అధికారులు జియోంగాన్ వరద నీటిని సమీపంలోని పట్టణాలు మరియు గ్రామాలకు మళ్లించారు. అధ్యక్షుడి డ్రీమ్ ప్రాజెక్టును రక్షించడానికి తమను ముంచేశారని అక్కడి ప్రజలు నిరసనలు వ్యక్తం చేశారు. అదే సమయంలో అక్కడ నివసించడానికి , పరిశ్రమలు పెట్టడానికి చాలా షరతులను చైనా ప్రభుత్వం పెట్టింది. జియోంగాన్ సిటీ నిర్మాణానికి చైనా లక్షల కోట్ల పెట్టుబడి పెట్టారు. యాభై లక్షల మిలియన్ల మంది నగరంలో స్థిరపడతారని అధికారులు అంచనా వేశారు. అయితే చైనా ఆర్థిక మందగమనం జనాభా పెరుగుదల తగ్గడం వంటి కారణాలతో ఆ సిటీ ఫుల్ కావడంలేదు.
జియోంగాన్ చైనా భవిష్యత్ పట్టణ ప్రణాళిక విజయానికి చిహ్నంగా పరిణామం చెందుతుందా లేదా విఫలమైన వానిటీ ప్రాజెక్టుగా మారుతుందా అన్నదానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సిటీ చాలావరకు ఖాళీగా ఉంది. చైనా అధ్యక్షుడు ఎంతో ఊహించుకున్న ఈ సిటీని చాలా వేగంగా నిర్మించినప్పటికీ.. దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావడం లో ఫెయిలయ్యారు. త్వరలో రూల్స్ మార్చి అయినా ఆ నగరాన్ని ప్రజలతో నింపాలని చైనా ప్రభుత్వం భావిస్తోంది.
Also read: మస్క్ కుమారుడు చీమిడి పూశాడట – 145 ఏళ్ల చరిత్ర ఉన్నదాన్ని చరిత్రలో కలిపేశాడు – ట్రంప్ మరి !
మరిన్ని చూడండి