Kakinada Crime : కాకినాడ జిల్లాలో ఘోరమైన ఘటన జరిగింది. కేక్ కొనిస్తానని నమ్మబలికి ఐదేళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారానికి యత్నించాడు. బాలిక ఏడుస్తూ కేకలు వేయడంతో.. అక్కడే వదిలేసి పారిపోయాడు. స్థానికుల సహాయంతో చిన్నారి అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.