SLBC Update : ఎస్ఎల్‌బీసీ ఘటనకు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. వివిధ బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొనగా.. మంత్రులు, అధికారులు పర్యవేక్షిస్తున్నారు. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్‌డేట్ ఇచ్చారు. ప్రమాదం జరిగిన చోటు వద్ద రాత్రి నుంచి ఎటువంటి శబ్దాలు వినిపించలేదని స్పష్టం చేశారు.