ByGanesh
Wed 26th Feb 2025 09:37 PM
సూపర్ హిట్ చిత్రాలు సలార్, కల్కి 2898 ఏ డి విజయాల తర్వాత ప్రభాస్ తన సినిమాల స్పీడ్‌ను మరింత పెంచేశారు. ప్రస్తుతం ఆయన వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటమే కాకుండా కొత్త కథలకూ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ మరో కొత్త సినిమాకు ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త ప్రభాస్ ఫ్యాన్స్‌లో భారీ ఉత్సాహాన్ని నింపుతోంది.
హనుమాన్ మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ ఇప్పుడు ప్రభాస్‌తో సినిమా చేయబోతున్నారని టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను హోంబలే ఫిల్మ్స్ నిర్మించే అవకాశాలున్నాయని ఫిలిం సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. శివరాత్రి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టెస్ట్ లుక్ విడుదల చేసే యోచనలో చిత్రబృందం ఉందని తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్‌పై ఇప్పటి నుంచే భారీ అంచనాలు పెరుగుతున్నాయి.
ఇక మరోవైపు ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీ విడుదల తేదీపై ఇంకా క్లారిటీ రాలేదని టాక్. అయితే సలార్ రీ రిలీజ్‌ను మార్చి 21న థియేటర్లలో ప్రదర్శించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండటం మరోవైపు కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆయన అభిమానులకు నిజంగా పండగ లాంటి వార్తే అని చెప్పొచ్చు.
Prabhas powering his new project:
Crazy developments in Prabhas Prashanth Varma project