Aadhi Pinisetty On Divorce Rumours విడాకుల వార్తలపై ఆది పినిశెట్టి రియాక్షన్


Wed 26th Feb 2025 07:53 PM

aadhi pinisetty  విడాకుల వార్తలపై ఆది పినిశెట్టి రియాక్షన్


Aadhi Pinisetty On Divorce Rumours విడాకుల వార్తలపై ఆది పినిశెట్టి రియాక్షన్

కోలీవుడ్ హీరో అది పినిశెట్టి అప్పుడప్పుడు తెలుగు ప్రేక్షకులను విలన్ గానో, లేదంటే హీరోగానో పలకరించిపోతూ ఉంటాడు, తెలుగు కుర్రాడే అయినా కోలీవుడ్ లో సెటిల్ అయిన ఆది పినిశెట్టి రేపు శుక్రవారం శబ్దం మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కొన్నాళ్ళక్రితమే కోలీవుడ్ హీరోయిన్ నిక్కీ గల్రానిని ఆది ప్రేమ వివాహం చేసుకున్నాడు. 

ఆతర్వాత నిక్కీ గల్రాని-ఆది పినిశెట్టి లు గడుపుతున్న అద్భుతమైన క్షణాలను ఎప్పటికప్పుడు పిక్స్ రూపమ్ లో సోషల్ మీడియాలో షేర్ చెయ్యడమే కాదు బర్త్ డే లకు, యానివర్సరీలకు, ఫెస్టివల్స్ కు స్పెషల్ పోస్ట్ లు పెడుతూ వారి ప్రేమను తెలియజేస్తూ ఉండే ఈ జంట విడాకులు తీసుకోబోతుంది అంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. 

తాజాగా ఆది పినిశెట్టి నిక్కీతో తన విడాకులపై వస్తోన్న వార్తలపై స్పందించాడు. నిక్కీ గల్రాని మొదట్నుంచి నాకు మంచి ఫ్రెండ్. నా ఫ్యామిలీకి కూడా ఆమె బాగా దగ్గరైంది. మా ఇంట్లో వాళ్లు తనకు బాగా నచ్చారు. ప్రేమలో పడ్డాను, పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. సంతోషంగా జీవిస్తున్నాం. కొద్దిరోజుల క్రితం మేం విడాకులు తీసుకుంటున్నట్లు యూట్యూబ్‌ లో స్టోరీలు కనిపించాయి. 

ఫస్ట్ టైమ్ అలాంటి వార్తలు చదివి చూసి షాకయ్యా, చాలా కోపం వచ్చింది. తర్వాత ఆ యూట్యూబ్ ఛానెళ్లలో ఓల్డ్ వీడియోలు చూస్తే వాళ్ల వ్యవహారం అర్థమైంది. ఇలాంటి వాళ్లను పట్టించుకోవడం వేస్ట్ అనిపించింది. యూట్యూబ్ క్లిక్స్ కోసం ఎంతకైనా తెగిస్తారని అర్థమై సైలెంట్ అయ్యాను అంటూ అది పినిశెట్టి విడాకుల వార్తలను కొట్టిపారేశాడు. 


Aadhi Pinisetty On Divorce Rumours:

Aadhi Pinisetty Opens Up About Divorce Rumors





Source link