Maha Kumbhha Mela 2025:మహా కుంభమేళా ముగిసింది. దాదాపు 64కోట్ల మంది ఈ జాతరలో పాల్గొన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. జనవరి 13వ తేదీన మొదలైన కుంభమేళ ఫిబ్రవరి 26న శివరాత్రి రోజున ముగిసింది. ఇది ప్రపంచ మానవ చరిత్రలో అతి పెద్ద మానవ సమ్మేళనంగా చెప్పవచ్చు. కుంభమేళా ఎందుకు జరుగుతుంది.. ఎప్పటి నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు. కుంభమేళా వెనుక ఆచార సంప్రదాయాలపై పుంఖాను పుంఖానులుగా వార్తలు , వివరణలు వచ్చాయి. ఈ కుంభమేళలో ప్రత్యేకమైంది. మూడు నదుల సంగమం. ఆ నదుల భౌగోళిక విశేషాలు ఈ కథనంలో చూద్దాం.

త్రివేణి సంగమ స్థానమే కుంభమేళాకు ప్రత్యేకత
ఉత్తరప్రదేశ్‌లోని ఒకప్పటి అలహాబాద్ నేటి ప్రయాగ్‌రాజ్ వద్ద గంగ, యమున, సరస్వతి అనే మూడు నదులు కలుస్తాయి. అందుకే దీన్ని త్రివేణి సంగమంగా పిలుస్తారు. ఈ నదులకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక చరిత్ర ఉంది. ఈ మూడు కలిసిన ప్రయాగ్‌రాజ్‌లో స్నానాలు ఆచరించడం ఓ సంప్రదాయంగా మారింది. అది కుంభమేళా వంటి చారిత్రక ఘట్టంలో స్నానం చేయడం భక్తులకు ఓ రివాజు. అయితే ఇందులో కీలకం గంగ, యమున, సరస్వతి నదులే.

గంగా నది..
గంగానది ఉత్తరాఖండ్ రాష్ట్ర పరిధిలోని గంగోత్రి వద్ద హిమనీ నదంలో పుట్టి హిమాలయాల్లో ప్రవహిస్తూ మైదాన ప్రాంతానికి చేరుతుంది. దీన్నే గంగామైదానం అని కూడా పిలుస్తారు. ఈ ప్రవహ మార్గంలో మరిన్ని ఉపనదులు కలుస్తాయి. అవి కోసి, గోమతి, శోణ అనే ఉప నదులు. ఆ తర్వాత ప్రయాగ్‌రాజ్ వద్ద యమునా నది కూడా కలుస్తుంది. ఇది కూడా గంగానదికి ఉపనది లాంటిదే. అయితే యుమున పెద్ద నది కావడంతో దీన్ని ప్రత్యేక నదిగా గుర్తిస్తారు. ఈ రెండు నదుల ప్రవాహ మార్గంలోని ఒడ్డున ఢిల్లీ, కాన్పూర్, ఒకప్పటి అలహాబాద్ నేటి ప్రయాగ్‌రాజ్, వారణాసి, పాట్నా, కోల్‌కతా నగరాలు ఉన్నాయి. ప్రయాగ్‌రాజ్ దాటాక గంగా నది ప్రవాహంలో ఇతర అనేక ఉపనదులు కలిసి మహా ప్రవాహ గంగా నదిగా మన దేశంలో పశ్చిమ బెంగాల్‌లోని మాల్టా వద్ద రెండుగా చీలుతుంది. ఆ చీలిక నుంచి హుగ్లీ నది ప్రారంభం అవుతుంది. ఈ హుగ్లీ నదీ ఒడ్డునే కోలోకత్తా నగరం ఏర్పడింది. ఇక్కడి నుంచి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించి అక్కడ బ్రహ్మపుత్ర ఉపనదులతో కలిసి గంగా ప్రవాహం బంగాళాఖాతంలో కలుస్తోంది. గంగా నది పొడవు 2525 కిలోమీటర్లు. ప్రపంచ పొడవైన నదుల్లో గంగానదిది ఏడో స్థానం.

యుమునా నది…
గంగా నదికి యునా నది ఉపనదే. కాని ఇది కూడా పెద్ద నదుల్లో ఒకటి కావడంతో దీన్ని గంగానది ఉపనది కన్నా ప్రత్యేక నదిగానే చెబుతారు. యమునా నది హిమాలయ పర్వత శ్రేణుల్లో భాగమైన కాళింది పర్వతంలో యమునోత్రి అనే ప్రాంతంలో పుట్టింది. దీన్నే జమున, జమ్నా అని సంస్కృతంలో పిలుస్తారు. దీని ఉపనదులు ట్రాన్స్, చంబల్, కెన్, బెట్వాలు. దీని పొడవు 1370 కిలోమీటర్లు. ఢిల్లీ, హర్యానా, యూపీ రాష్ట్రాల గుండా ప్రవహించి ఇది ప్రయాగ రాజ్ వద్ద గంగానదిలో కలుస్తుంది. ఈ నది విశిష్టత ఏంటంటే గంగానదికి ఎడమ వైపు పుట్టిన ఈ నది కుడివైపున గంగానదిలో కలుస్తుంది.

సరస్వతీ నది…
సరస్వతీ నది నేడు భౌగోళికంగా కనిపించదు. ఇది పురాణాల్లో కనిపించే నదిగా రుగ్వేదంలో చెప్పారు. సరస్వతీ నది యుమునా నదికి పశ్చిమాన సట్లెజ్ నది ఉందని, ఇది మహా భారత కాలంలో ఎండిపోయిందని చెబుతారు ఆర్కియాలజిస్టులు. అయితే హర్యానాలోని షుగ్గర్ వద్ద యుమునలో సరస్వతి నది కలిసిపోయిందని ఆ తర్వాత అంతర్థానమైపోయిందని చెబుతారు. సరస్వతీ నది ప్రయాగ వద్ద గంగ, యమున నదులతో సంగమం అవుతుందని హిందువుల గట్టి నమ్మకం.

సరస్వతి నది కనిపించకపోయినా, గంగా, యుమన నదుల్లో అంతర్భాగంగా ఉందని ప్రజలన నమ్మం. అయితే ఈ నదులు కేవలం ఆధ్యాత్మిక భావనలను పెంచడమే కాదు. భారత దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టు అని చెప్పవచ్చు. ఈ నదుల చూట్టూ గొప్ప నగరాలు వెలిశాయి. ఉత్తర భారత దేశానికి గంగా, యమున నదులు భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రాలుగా, సామాన్య ప్రజలు ఆర్థిక వనరులుగా ఉపయోగపడుతున్నాయి.

Also Read: కేదార్ నాథ్ ఆలయం తెరిచే డేట్ ఇదే .. శివరాత్రి సందర్భంగా ప్రకటించిన బద్రీనాథ్ – కేదార్నాథ్ బోర్డ్