Maharashtra Latest News: మహారాష్ట్రలోని బుల్తానా జిల్లాకు కొత్త చిక్కు వచ్చింది. పడింది. జిల్లా ఉంటున్న వారు బయటకు వెళ్లాలంటే సిగ్గుతో చచ్చిపోతున్నారు. ఇప్పటి వరకు నెత్తిపై ఒత్తుగా పెరిగిన జుట్టు ఒక్కసారిగా రాలిపోవడంతో ప్రారంభమైంది. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు ఇదే సమస్యతో బాధపడుతున్నారు. యువత ఉద్యోగాలకు కాలేజీలకు వెళ్లడం మానేశారు. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వైద్యులకు కూడా ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.
చివరకు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ హిమ్మత్రవ్ బవాస్కర్ సమస్యకు మూలు ఎక్కడ ఉన్నాయో గుర్తించారు. బల్తానా జిల్లా వాసులు తింటున్న రొట్టెల్లోనే సమస్య ఉందని గుర్తించారు. రొట్టెల తయారీకి వాడుతున్న గోధుమ పిండి సిలీనియం అధికస్థాయిలో ఉందని గుర్తించారు. దీని కారణంగానే అలోపిసియా రావడంతో జుట్టు ఊడిపోవడం మొదలైందని తేల్చారు.
ఈ గోధుమ పిండితో చేసిన రొట్టెలు తినడంతోనే డిసెంబర్ 2024 నుంచి బుల్ధానాలోని 18 గ్రామాల్లో ప్రజలు సమస్య ఎదుర్కొంటున్నారు. ఒక్కసారిగా జుట్టు రాలిపోవడంతో విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడింది. వివాహాలు పోస్ట్‌పోన్ అవుతున్నాయి. చాలా మంది యువత మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. జుట్టు రాలిపోతుందని భయంతో చాలా మంది ప్రజలకు గుండు కొట్టించుకుంటున్నారు.
సమస్యను గుర్తించిన అధికారులు ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి నమూనాలను సేకరించారు. జుట్టు ఊడిపోతున్న వ్యక్తులు తలనొప్పి, జ్వరం, తల దురద, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలతో బాధపడుతున్నట్టు రాయ్‌గడ్‌లోని బవాస్కర్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ MD డాక్టర్ హిమ్మత్రావ్ బవాస్కర్ PTI కి తెలిపారు.
“ఈ వ్యాప్తికి ప్రధాన కారణం పంజాబ్, హర్యానా నుంచి దిగుమతి చేసుకున్న గోధుమలు. అక్కడ పండుతున్న గోధుమల్లో సాధారణం కంటే సెలీనియం కంటెంట్ ఎక్కువగా ఉన్నట్లు తేలింది” అని బవాస్కర్ చెప్పారు.
“ప్రభావిత ప్రాంతం నుంచి గోధుమలను విశ్లేషించినప్పుడు, స్థానికంగా పండించిన రకం కంటే ఇందులో 600 రెట్లు ఎక్కువ సెలీనియం ఉందని తేలింది. ఈ అధిక సెలీనియం తీసుకోవడం అలోపేసియా కేసులకు కారణం” అని ఆయన అన్నారు.
ఇది వేగంగా వ్యాపించి లక్షణాలు ప్రారంభమైన మూడు నుంచి నాలుగు రోజుల్లోనే బట్టతల వస్తుంది చెప్పారు. బాధితుల రక్తం, మూత్రం, జుట్టులో సెలీనియం రేటు గణనీయంగా ఉందని తేల్చారు.
“రక్తం, మూత్రం, జుట్టు నమూనాల్లో వరుసగా 35 రెట్లు, 60 రెట్లు, 150 రెట్లు సెలీనియం కంటెంట్ కనిపించింది. అధిక సెలీనియం తీసుకోవడం వ్యాధి వ్యాప్తికి దోహదపడుతుంది” అని బవాస్కర్ చెప్పారు.
“బాధిత వ్యక్తుల్లో జింక్ పర్సెంటేజ్ గణనీయంగా తక్కువగా ఉందని మా టీం గుర్తించింది, ఇది అదనపు సెలీనియం వల్ల కలిగే అసాధారణ చర్య” అని ఆయన అన్నారు.
నివారణ చర్యగా సెలీనియం అధికంగా ఉండే గోధుమలను తినడం మానేయాలని అధికారులు సూచించారు. గోధమలు తినడం మానేయడంతో 5-6 వారాల్లోపు కొంతమంది జుట్టు తిరిగి పెరిగిందని తెలుస్తోంది.
సిలీనియం ఎందుకు ఉంది?
సిలీనియం మన శరీరానికి తగిన మోదులో అవసరం. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి సహకరిస్తుంది. అదే ఎక్కువైనా తక్కువైనా జుట్టు రాలడం, చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. దీని కారణంగానే బుల్తానా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
గోధుమల‌్లోకి సిలీనియం ఎలా వస్తుంది?
పర్వతప్రాంతాల్లో సిలీనియం అధికస్థాయిలో ఉంటుంది. అక్కడి నుంచి పడే వర్షపు నీళ్లు కిందికి పంట భూములకు చేరుతాయి. ఆ నీళ్లతోపాటే సిలీనియం కూడా కలిసిపోతుంది. బుల్తానా జిల్లాల ప్రజలకు పంజాబ్, హర్యానా నుంచి గోదుమలు సరఫరా అవుతున్నాయి. ఇక్కడ ఉన్న శివాలిక్ పర్వత శ్రేణుల్లో కూడా సిలీనియం ఎక్కువగా ఉంటుంది. అది పంట భూములకు చేరుతుంది. ఇది ఒక కారణం అయితే…. పంటల కోసం వాడే పాస్పేట్ ఎరువుల ద్వారా కూడా సిలీనియం సమస్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు కారణాలతో గోధుమల్లో సిలీనియం మోతాదు ఎక్కువ అవుతోంది.
Also Read: మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్‌గా గెలిచిన ఇండియన్ బ్యూటీలు వీళ్లే
మరిన్ని చూడండి