Pooja Glamorous Addition to Coolie జిగేలు రాణి కి మించి పూజ హెగ్డే కూలి సాంగ్


Thu 27th Feb 2025 05:34 PM

coolie  జిగేలు రాణి కి మించి పూజ హెగ్డే కూలి సాంగ్


Pooja Glamorous Addition to Coolie జిగేలు రాణి కి మించి పూజ హెగ్డే కూలి సాంగ్

సుకుమార్-రామ్ చరణ్ కాంబోలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన రంగస్థలం చిత్రంలో జిగేలు రాణి అంటూ రామ్ చరణ్ తో కలిసి చిందేసిన పూజ హెగ్డే అప్పట్లో హీరోయిన్ గాను సౌత్ ను ఓ ఊపు ఊపేసింది. గత రెండేళ్లుగా పూజ హెగ్డే టైమ్ బాగోక సైలెంట్ అయ్యింది. ఈమధ్యన కోలీవుడ్ లో కాలు మోపి బిజీగా మారిపోయింది. 

సూర్య, విజయ్, రాఘవ లారెన్స్ లాంటి క్రేజీ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకొవడమే కాదు సూపర్ స్టార్ రజినీకాంత్ కూలి లో స్పెషల్ సాంగ్ లో కాలు కదపబోతుంది అనే టాక్ ని నిజం చేసేసింది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ మొదటిసారి ఓ స్పెషల్ సాంగ్ కి అధిక ప్రాధాన్యమిస్తూ అందులో పూజ హెగ్డే ను సెలెక్ట్ చేసుకున్నాడు. 

తాజాగా పూజ హెగ్డే కూలిలో స్పెషల్ సాంగ్ కి చేస్తున్న విషయాన్ని పూజ హెగ్డే లుక్ తో టీమ్ కన్ ఫర్మ్ చేసింది. రెడ్ ఫ్రాక్ లో గ్లామర్ గా పూజ హెగ్డే కూలి ఐటెం సాంగ్ లో నర్తించబోతుంది. ఆ పిక్ చూసాక జిగేలు రాణి కి మించి కూలి లో పూజ హెగ్డే స్పెషల్ సాంగ్ అంటున్నారు నెటిజెన్స్. 

 


Pooja Glamorous Addition to Coolie:

Pooja Hegde special song in Coolie





Source link