ధర్మపురిలో కన్నుల పండువలా శ్రీలక్ష్మీనృసింహ స్వామి కళ్యాణోత్సవం, భారీగా హాజరైన భక్తులు…-sri lakshmi narasimha swamys wedding ceremony in dharmapuri is a feast for the eyes ,తెలంగాణ న్యూస్

మూడు రోజులు తెప్పోత్సవం…డోలోత్సవం..

13 రోజులు నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో వారం రోజులు అత్యంత కీలకమైనవి. ఆయా రోజుల్లో నిత్యం 50 వేల నుంచి లక్ష వరకు భక్తులు వస్తుంటారని అధికారుల ఆంచనా వేశారు. పుట్ట బంగారంతో ప్రారంభమైన వేడుకల్లో 14, 15, 16వ తేదీల్లో బ్రహ్మపుష్కరిణి కోనేరులో యోగ, ఉగ్ర, వేంకటేశ్వర స్వాముల తెప్పోత్సవం, డోలోత్సవం, 16, 17, 18వ తేదీల్లో స్వామివారల దక్షిణ, ఉత్తర దిగ్యాత్ర కార్యక్రమాలు చేపడతారు. 19న ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం స్వామివారల రథోత్సవం సాయంత్రం నిర్వహిస్తారు. 20, 21, 22వ తేదీల్లో ఉత్సవమూర్తుల ఏకంతోత్సవాలను వైభవంగా జరిపిస్తారు.

Source link