ఆ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం, పాఠశాల వాతావరణం అంతర్గత రోడ్ల నిర్మాణం, అన్ని మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. కొండపర్తి గ్రామంలో అందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుతామన్నారు. ఇక్కడి పిల్లలు ఇంగ్లీషులో మాట్లాడడం, పాటలు పాడడం ఆనందంగా ఉందన్నారు. కొండపర్తిలో తయారుచేసిన మసాలా, కారం, పసుపు ప్రత్యేక బ్రాండ్లుగా నిలవాలని, కుటీర పరిశ్రమలు మరింత అభివృద్ధి కావాలన్నారు.