ఏపీలో నకిలీ పెన్షన్ల ఏరివేత షురూ, వికలాంగుల పెన్షన్లలో భారీగా అక్రమాలు, వేలల్లో అనర్హులకు చెల్లింపులు-fake pensions being identified in ap massive irregularities in pensions for the disabled ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

వృద్ధాప్య పెన్షన్ల తనిఖీ ఎప్పుడు..

మరోవైపు ఏపీలో ప్రతి నెలల దాదాపు 63లక్షల మందికి రకరకాల పెన్షన్లను చెల్లిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం కుటుంబాల్లో 90శాతం మందికి తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేశారు. రైస్‌ కార్డుల ప్రతిపాదికన ప్రతి కుటుంబంలో వృద్ధాప్య, వితంతు పెన్షన్లను మంజూరు చేశారు. ఈ క్రమంలో అడ్డదారిలో పెన్షన్లను దక్కించుకున్న వారి సంఖ్య లక్షల్లో ఉంది. రాజకీయ సిఫార్సులు, సిబ్బంది అవినీతితో అర్హత లేకున్నా పెన్షన్లను ఎడాపెడా ఇచ్చేశారు. అనర్హులను గుర్తించే విషయంలో రాజకీయ విమర్శలకు ప్రభుత్వం వెనుకంజ వేస్తోంది.

Source link