వైసీపీలో రెండు సార్లు రాజ్యసభకు అవకాశం కల్పించినా ఆ పార్టీలో కొనసాగడం అనవసరం అనే భావనకు రావడం వెనుక చాలా కారణాలు ఉన్నట్టు సాయిరెడ్డి సన్నిహతులు చెబుతున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా కీలక విషయాలపై సాయిరెడ్డి ప్రమేయాన్ని, ప్రాధాన్యతను తగ్గించడం, అధికారుల ఎదుట చులకన చేయడం, సాయిరెడ్డి బాధ్యతలు చెవిరెడ్డి నిర్వహిస్తారని ఐఏఎస్ అధికారులకు నేరుగా స్పష్టం చేయడం వంటి అంశాలతో జగన్‌తో దూరం పెరిగినట్టు తెలుస్తోంది.