Urban Company 15 Min Maid Service Has Caused Massive Outrage On The Internet | Insta Maids: ఆన్‌లైన్‌లో పని మనుషులు- అర్బన్ కంపెనీ కొత్త సర్వీస్ -కానీ నెటిజన్ల విమర్శలు

15 Min Maid Service:  ఇప్పుడు అంతా ఆన్ లైన్ . ఏ పని చేసుకోవాలన్నా ఫోన్ క్లిక్ తో అయిపోతుంది.  అయితే ఈ ఆన్ లైన్ సర్వీసులు ఇంకా మైక్రో లెవల్ కు చేరలేదు. అంటే కిందిస్థాయిలో ఇంట్లో పని మనుషులు చేసే పనులు చేసే సర్వీసుల వరకూ చేరలేదు. కానీ ఇప్పుడిప్పుడే కొన్ని కంపెనీలు ఆ సర్వీసులు అందిస్తున్నాయి.  

మెట్రో సిటీల్లో ఉరుకుల పరుగుల జీవితంలో పని మనిషి చాలా కీలకం. ఇంట్లో పనులన్నీ చేసే మంచి పని మనిషి ఉంటే ఆ కుటుంబం హ్యాపీగా ఉంటుంది. లేకపోతే అన్ని పనులూ ఇంటావిడ మీద పడి అసహనంతో ఇంటాయనపై చిరాకుపడతారు. దాని వల్ల కాపురాల్లో కలతలు వస్తాయి. మంచి పని మనుషులు ఉన్నా ఒక్కో సారి సెలవులు పెట్టేస్తారు. ఇలాంటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమస్యలను అధిగమించడానికి అర్బన్ కంపెనీ కొత్తగా ఇన్ స్టా మెయిడ్ సర్వీస్ ను తీసుకు వచ్చింది. ముంబైలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని ప్రారంభించారు. ఇన్ స్టా మెయిడ్ పేరుతో దీన్ని ప్రారంభించారు.  

అయితే మెయిడ్ అనే పదాన్ని వాడటంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అది వారిని అవమానించడమేనని అంటున్నారు. దీనిపై అర్బన్ కంపెనీ కూడా స్పందించిది. ఇన్ స్టా హెల్ప్ అని సర్వీసును మార్చేందుకు నిర్ణయించింది. 



 అయితే నెటిజన్ల నుంచి పేరు విషయంలో అభ్యంతరాలు వచ్చిన సర్వీస్‌కు మాత్రం మంచి ఆదరణ లభిస్తోంది. ఎక్కువ మంది ఇలాంటి సర్వీస్ కోసమే ఎదురుచూస్తున్నట్లుగా ట్వీట్లు పెడుతున్నారు. 



మెట్రో సిటీలకు అన్నింటికీ విస్తరిస్తే.. చాలా మంది  హోమ్ హెల్పర్లకు మంచి ఆదాయం లభించే అవకాశం ఉంది. 

మరిన్ని చదవండి

మరిన్ని చూడండి

Source link