Thousand crore liquor scam is creating a stir in Tamil Nadu | Tamilnadu: డీఎంకే తమిళ రాజకీయాలకు చెక్

Thousand crore liquor:  తమిళనాడులో వెయ్యి కోట్ల లిక్కర్ స్కాం కలకలం రేపుతోంది. తమిళనాడు స్టేట్‌ మార్కెటింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌  రూ.1,000 కోట్లకు పైగా అవినీతి చోటుచేసుకుందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారికంగా ప్రకటించింది.  రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన  టాస్మాక్ 4,830 దుకాణాలకు మద్యం సరఫరా చేస్తుంది.  ప్రతిరోజూ దాదాపుగా రూ. 150 కోట్ల మేర అమ్మకాలు జరుగుతాయి.  ప్రస్తుతం ఈడీ ప్రయివేట్ డిస్టిలరీలు, మధ్యవర్తులు, ఎక్సైజ్ శాఖ మంత్రి వి. సెంథిల్ బాలాజీతో సంబంధం  ఉన్నట్లుగా భావిస్తున్న వ్యక్తులపై  దృష్టి పెట్టింది. ఎఫ్ఐఆర్ నమోదు తరువాత ఈడీ అధికారులు టాస్మాక్ ప్రధాన కార్యాలయం, గోదాములు, ప్రయివేట్ డిస్టిలరీలు, సెంథిల్ బాలాజీతో సంబంధం ఉన్న వ్యక్తుల ఇళ్లలో  ఈడీ సోదాలు నిర్వహించింది. 

డిస్టిలరీసులు తప్పుడు ఇన్వాయిస్‌లను రూపొందించాయని రవణా చార్జీలు, సరఫరా ఖర్చులను అధికం చేసి చూపించారని ఈడీ అధికారులు గుర్తించారు. లక్ష విలువైన లావాదేవీని లక్షన్నరగా మోదు చేసి..మిగిలిన యాభై వేలు లంచాలుగా నగదు రూపంలో పంపీణీ చేశారని ీడీ అధికారులు చెబుతున్నారు. ఈ స్కాంలో మద్యం కొనుగోలు చేసే బార్లు కీలకంగా ఉన్నాయని బావిస్తున్నారు.  మద్యం దుకాణాల్లో నిర్వహించే బార్లు ప్రధానంగా అధికార పార్టీ నేతలకు చెందినవవేనని చెబుతున్నారు. కీలకమైన ప్రాంతాల్లో  మూడు రోజులు సాగిన ఈ తనిఖీల్లో పలు కీలక పత్రాలు, భారీగా నగదు లభ్యమైనట్లుగా చెబుతున్నారు. అధికారంగా చూపించిన మొత్తంలో టాస్మాక్ అధికారులకు చాలా కొద్ది మొత్తం చేరిందని అత్యధిక భాగం రాజకీయ నేతలకు చేరిందని భావిస్తున్నారు. 

తమిళ రాజకీయం పూర్తిగా భాషా వివాదాలు, సెంటిమెంట్ చుట్టూ తిరుగుతోంది. ఇప్పుడు అవినీతి వ్యవహారం వెలుగు చూడటంతో బీజేపీ నేతలు..  డీఎంకే పై విరుచుకుపడుతున్నారు.  



 ప్రజల్ని డీఎంకే దోచుకు తింటోందని బీజేపీ నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే ఈడీ ప్రకటనపై ఇంకా డీఎంకే అధికారికంగా స్పందించాల్సి ఉంది                    .

మరిన్ని చదవండి

మరిన్ని చూడండి

Source link