Kerala fish : కాలం కలసి రాకపోతే తాడే పామై కరుస్తుందంటారు. అందులో నిజం ఉందో లేదో కానీ ఇంట్లో కర్రీగా మారాల్సిన చేప మాత్రం చేతుల్ని కూడా తీసేయగలదు. కేరళకు చెందిన రాజేశ్ అనే వ్యక్తి అనుభవం చూస్తే నిజమని అంగీకరిస్తారు.
కేరళలోని కన్నూరు జిల్లాకు చెందిన టి రాజేష్ అనే వ్యక్తి తన చేతులపై బొబ్బలు వచ్చాయని తగ్గడం లేదని ఆస్పత్రికి వెళ్లారు. పరీక్షలు చేసి వైద్యులు ఉన్న పళంగా బొబ్బలు వచ్చినంత వరకూ కత్తిరించకపోతే ఇన్ ఫెక్షన్ మెదడుకు వ్యాపిస్తుందని ప్రాణాలు పోతాయని తేల్చారు. చేయి పోతే పోయింది ప్రాణాలైనా ఉంటాయని రాజేశ్ చేయి తీయించుకున్నాడు.అయితే బొబ్బలు వస్తే చేయి తీసేయాల్సినంత సీరియస్ అవుతుందా అన్న ప్రశ్న రాజేష్ గురించి తెలిసిన వారికి వస్తుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అదేమిటంటే ఆ బొబ్బలు వచ్చింది ఓ చేప కరవడం వల్ల.
రాజేష్ కు కొన్ని చేపల చెరువులు ఉన్నాయి. వాటిలో చాలా రకాల చేపలు పెంచుతాడు. ఓ చెరువులో కడు అనే రకం చేపలు పెంచుతూంటాడు. మంచి లాభాలిచ్చే చేపలు కావడంతో వాటిని పెంచే చేరువును ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతాడు. ఇటీవల చెరువును క్లీన్ చేయించాలని అందులో కొద్దిగి మిగిలి ఉన్న చేపల్ని బయటకు తీశాడు. అలా తీస్తున్న సమయంలో ఓ చేప కరిచింది. చేపలు కరవడం అరుదు. అయినా టైం బాగోక ఆ చేప కరిచింది. అయితే ఇదంతా మామూలే అనుకుని అప్పటికి చెరువు శుభ్రం చేయించుకుని ఇంటికెళ్లిపోయాడు.
అయితే చేప కరిచిన చోట క్రమంగా గాయం పెరుగుతూ పోయింది . దీంతో రాజేష్ నిర్లక్ష్యం చేయడం ఎందుకని ఆస్పత్రికి వెళ్లాడు. మామూలు గాయమేనని వైద్యులు కూడా భావించి కొన్ని టాబ్లెట్లు.క్రీములు ఇచ్చి పంపించారు. వాటిని వాడితే తగ్గకపోకేగా కొత్తగా చేయి అంతా బొబ్బలు వస్తున్నాయి. దీంతో కంగారు పడిన రాజేష్.. పెద్ద ఆస్పత్రికి వెళ్లారు. అసలేం జరిగిందో తెలుసుకున్నవైద్యులు గ్యాస్ గ్యాంగ్రీన్ అనే బ్యాక్టీరియా సోకినట్లుగా గుర్తించారు. ఇది ఒక సారి అంటుకుంటే శరీరం మొత్తం వ్యాపిస్తుందని అలా జరగుకుండా ఉండాలంటే.. వ్యాపించినంత వరకూ తీసేయాల్సిందేనని వైద్యులు తేల్చారు. ఈ బ్యాక్టిరియా మెదడు వరకూ వ్యాపిస్తే ప్రాణాలు నిలబడవని అందుకే చేతిని తొలగించి ప్రాణాలు కాపాడామని వైద్యులు చెబుతున్నారు. కేరళలో ఇప్పటికి ఈ వ్యాధి ఇద్దరికే సోకింది. అందులో ఓ దురదృష్టవంతుడు రాజేష్.
കണ്ണൂരില് മീന് കൊത്തിയുണ്ടായ അണുബാധയെ തുടര്ന്ന് യുവാവിന്റെ കൈപ്പത്തി മുറിച്ചുമാറ്റി. pic.twitter.com/74n3SsL5l0
— Samakalika Malayalam (@samakalikam) March 12, 2025
చేప కరిచినందుకు చేయి పోయినందుకు బాధపడాలో.. కనీసం ప్రాణం నిలబడినందుకు సంతోషించాలో అర్థం కాని పరిస్థితి రాజేష్‌ది.
మరిన్ని చూడండి