వైసీపీ నేత జగన్ మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీ కారణంగా, నాకు వైసీపీ పార్టీలో జరిగిన అవమానాల కారణంగా, జగన్ బిహేవియర్ వలన గుండె ముక్కలైన కారణంగా తను వైసీపీ పార్టీకే కాదు, రాజకీయాలకే దూరమయ్యాను అంటూ వైసీపీ పార్టీ లో బలమైన నాయకుడిగా ఉన్న విజయసాయి రెడ్డి మీడియా ముఖంగా చెప్పడం వైసీపీ నేతలకి ఆగ్రహాన్ని కలిగించాయి.
విజయసాయి రెడ్డి కామెంట్స్ కి కౌంటర్ అటాక్ చేసుకుంటూ ఒక్కొక్కరిగా మీడియా ముందుకు వస్తున్నారు. నిన్న కాకాణి, ఈరోజు అంబటి రాంబాబు విజయసాయి రెడ్డి చేసిన కోటరీ వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తున్నారు. కోటరీ కారణంగా వైసీపీ పార్టీకి, జగన్ కి దూరమయ్యాను అని విజయ సాయి రెడ్డి చెబుతున్నాడు, జగన్ గారి దగ్గర విజయసాయి రెడ్డి మించిన కోటరీ గిరి లేదు, వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో కీలకంగా ఉండడమే కాదు జగన్ కు ఆయనే ప్రధాన సలహాదారుడు, ఆయనే కోటరీ.
జగన్ గారికి రైట్ చెవిలో, లెఫ్ట్ చెవిలో ఆయనే సలహాలు ఇచ్చేవాడు. ఆయన పార్టీని వదిలి బయటికెళ్ళిపోయాడు, అలాంటి వాడు ఏం చేస్తాడు, బురద చల్లుతాడు, ఇప్పుడు సాయి రెడ్డి అదే చేస్తున్నాడు. అది ఆయనకు మంచిది కాదు, ఆయన వైసీపీలో ఓ నాయకుడిగా ఎదిగాడు, వైసీపీ పార్టీ పెట్టకముందు ఆయనొక చార్టెడ్ అకౌంటెంట్. అలాంటిది పార్లమెంట్ లో ఎంపీగా అంచలంచలుగా ఎదిగిన ఆయన ఈ రోజు మాట్లాడుతున్నాడు.
పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు మట్లాడేవాళ్లు చాలామంది ఉంటారు. అందులో సాయి రెడ్డి ఒకడు అంటూ అంబటి రాంబాబు విజయ్ సాయి రెడ్డి వ్యాఖ్యలపై లైట్ తీసుకుంటున్నట్టుగా కౌంటర్ వేశారు.