ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేశారా..? మీ ఛార్జీలను ఇలా చెల్లించుకోండి, ప్రాసెస్ వివరాలివే-do you know how to pay the lrs charges know these steps ,తెలంగాణ న్యూస్

అనధికార లేఔట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. స్కీమ్ అమలులో వేగం పెంచేందుకు 25 శాతం రాయితీని కూడా ప్రకటించింది. దీంతో చాలా మంది దరఖాస్తుదారులు ముందుకు వస్తున్నారు. రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. అయితే మార్చి 31వ తేదీతో ఈ గడువు పూర్తి కానుంది. ఈ తేదీలోపు ఫీజు చెల్లించినవారికి మాత్రమే… రాయితీ నిర్ణయం వర్తింస్తుంది.

Source link