ఇందిరమ్మ ఇళ్ల పథకంపై గందరగోళం.. మళ్లీ సర్వే చేసి వివరాలు ఇవ్వాలన్న కేంద్రం!-central government instructs telangana government to conduct another survey regarding indiramma housing scheme ,తెలంగాణ న్యూస్

కారణాలు ఏంటి..

ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులపై సర్వే చేశారు. కానీ.. అందులో బ్యాంకు ఖాతా, ద్విచక్ర వాహనాలు, పన్ను చెల్లింపు వంటి వివరాలేవీ లేవని, అవి లేకుండా జాబితా తీసుకోబోమని కేంద్రం స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇవి పెద్దగా తేడా చూపే అంశాలు కాదని.. ఇళ్లను మంజూరు చేసేనాటికి ఆ వివరాలను కూడా అప్‌లోడ్‌ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం మళ్లీ కోరినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిధులు ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. కానీ ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.

Source link