మహిళలకు బస్సులు..
రూ.148.76 కోట్లతో దేవాదుల రెండో దశ, 274 ఇండ్లు ఘన్పూర్ మండలానికి, 238 ఇండ్లు ధర్మసాగర్, వేలైర్ మండలాలకు, రూ.15 కోట్లతో మల్లన్నగండి నుంచి తాటికొండ, జిట్టగూడెం నుంచి తరిగొప్పుల వరకు రహదారి విస్తరణ, రూ. 1 కోటితో స్టేషన్ ఘన్‌పూర్‌లో ఎన్పీడీసీఎల్ డివిజనల్ ఆఫీస్ కమ్ ఈఆర్వో ఆఫీస్ భవనం నిర్మాణం, రూ.2 కోట్లతో బంజారా భవన్ నిర్మాణం, రూ.1.76 కోట్లతో కుడా ఆధ్వర్యంలో పెద్దపెండ్యాల గ్రామంలో రోడ్ల విస్తరణ, మహిళా శక్తి కింద ఏడు ఆర్టీసీ బస్సులు మంజూరు (రూ.2.10 కోట్లు), స్వయం సహాయ సంఘాలకు రూ.100 కోట్ల బ్యాంక్ లింకేజ్ చెక్కును ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఇందిరా శక్తి స్టాల్స్‌ను పరిశీలించారు. చేతి అల్లికలతో తయారుచేసిన చిత్రపటాన్ని మహిళా సంఘాల సభ్యులు సీఎంకు అందించారు.