Another Wicket Falls For YCP వైస్సార్సీపీ నుంచి మరో వికెట్ పడింది


Wed 19th Mar 2025 01:32 PM

marri rajasekhar  వైస్సార్సీపీ నుంచి మరో వికెట్ పడింది


Another Wicket Falls For YCP వైస్సార్సీపీ నుంచి మరో వికెట్ పడింది

జగన్ దగ్గర ఉన్న నేతలంతా ఒక్కొక్కరిగా చేజారిపోతున్నారు. వైస్సార్సీపీ పార్టీలో ఉన్న వారంతా మెల్లగా తప్పుకుంటున్నారు. వైసీపీ పార్టీలో కీలక పాత్ర పోషించి చక్రం తిప్పిన వారు ఈరోజు జగన్ కు ఝలక్ లిస్తున్నారు. 11 మంది ఎమ్యెల్యే లతో ఏం చెయ్యాలో తోచని స్థితిలో ఉన్న జగన్ కి ఇప్పటికే.. ఉన్న ఎమ్యెల్సీలు, రాజ్యసభ ఎంపీలు రాజీనాలు చేసి షాకిచ్చారు. 

జగన్ తర్వాత నెంబర్ 2 గా వైసీపీ లో కనిపించిన విజయసాయి రెడ్డి రాజకీయాలనే వదిలేసారు. దానికి కారణం కూడా జగన్ అనే చెప్పారు. మరోపక్క ఎమ్యెల్సీలు  ఒక్కొక్కరిగా జగన్ ని వదిలేస్తున్నారు. ఇప్పటికే నలుగురు ఎమ్యెల్సీ వైసీపీ పార్టీని వీడారు. తాజాగా మరో ఎమ్యెల్సీ వైసీపీ పార్టీని వీడి జగన్ కు షాకిచ్చారు. 

మర్రి రాజశేఖర్ వైసీపీ పార్టీకి ఎమ్యెల్సీ పదవి కి రాజీనామ చేసారు. కొన్నాళ్లుగా జగన్ వైఖరి పట్ల మర్రి రాజశేఖర్ అసంతృప్తిగా ఉన్నారు. చిలకలూరి పేటలో విడదల రజిని పెత్తనాన్ని ఆయన సహించలేపోతున్నారు. గతంలో జగన్ ఆయనకు మంత్రి పదవి ఇస్తానని మోసం చెయ్యడంతో, ప్రస్తుతం పార్టీ అధికారంలో లేకపోడంతో మర్రి ఎమ్యెల్సీ పదవికి రాజీనామా చేసారు. 

కార్యకర్తలతో చర్చించాకే తన భవిష్యత్తు కార్యాచరణను బయటపెడతాను అని మర్రి రాజశేఖర్ ప్రకటించారు. దానితో వైస్సార్సీపీ పార్టీలో మరో వికెట్ డౌన్ అయ్యింది. అసలే వీక్ గా ఉన్న పార్టీలో ఇలా ఒక్కొక్కరిగా వెళ్లిపోవడం మాత్రం జగన్ కు తలనొప్పే అని చెప్పాలి. 


Another Wicket Falls For YCP:

Marri Rajasekhar quits YSRCP and MLC post





Source link