నాగ చైతన్య, సమంత తో విడాకుల తర్వాత ఓ రెండుమూడేళ్లు లోన్లీ గా సఫర్ అయినా ఆ తర్వాత చాలా త్వరగా శోభిత దూళిపాళ్లతో ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. గత ఏడాది డిసెంబర్ లో నాగ చైతన్య-శోభితల వివాహం అయ్యింది. అసలు చైతు-శోభిత లు ఎలా ప్రేమలో పడ్డారు. ఎప్పడు వీరు కలుసుకున్నారనే విషయంలో చాలామందికి చాలా అనుమానాలున్నాయి.
శోభిత, చైతు విడివిడిగా ఎలా ప్రేమలో పడ్డారో చెప్పారు, అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ లో కలిశాము, తర్వాత డేట్ కి వెళ్లామంటూ చెప్పుకొచ్చారు. తాజాగా నాగ చైతన్య-శోభితలు జంటగా మొదటిసారిగా ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యారు. వోగ్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో ఈ జంట చాలా విషయాలు ముఖ్యంగా తమ డేటింగ్ విషయాలు రివీల్ చేసింది. ఓ అభిమాని నన్ను.. సోషల్ మీడియా లో చైతు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, మీరెందుకు ఫాలో అవ్వడం లేదు అని అడిగాడు.
అప్పుడు చైతు ప్రొఫైల్ చెక్ చేస్తే ఆయన నన్ను ఇంకా కొద్దిమందిని మాత్రమే ఫాలో అవుతున్నాడు. అప్పడు నేను కూడా చైతూని ఫాలో అయ్యాను, ఆన్ లైన్ లో చాటింగ్ చేసుకునేవాళ్లం.
2022 ఏప్రిల్ లో మొదటిసారి మేము కలుసుకున్నాం. చైతు నా కోసం ఫ్లైట్ టికెట్ వేసుకుని ముంబై వచ్చాడు, మేము మొదటిసారి కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసాము, ఆతర్వాత మా మధ్యలో ప్రేమ మొదలయ్యింది, డేటింగ్ చేసాము. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాము. ఇదంతా నేచురల్ గా జరిగింది అంటూ శోభిత ఆ ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చింది.