Pakistani Latest News: పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్ పరిస్థితి అంతకంటే దారుణంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్ సంబంధించి దుస్థితిని తెలియజేసే ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తరచుగా వైరల్ అవుతున్నాయి. ఇందులో దాని దయనీయ పరిస్థితి కనిపిస్తుంది. చిత్రాలు బయటకు వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఇబ్బందిని కూడా ఎదుర్కోవలసి వస్తుంది. అదే సమయంలో అనేకసార్లు ఈ ఇబ్బంది అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుంది. దాని నుంచి తప్పించుకోవడానికి, పాకిస్తాన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక కొత్త నియమాన్ని అమలు చేసింది.
పాకిస్తాన్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ (PAA) ఈ విషయంలో కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇక నుంచి ఎవరూ పాకిస్తాన్‌లోని ఏదైనా ఎయిర్‌పోర్టులో లేదా ఏదైనా విమానంలో ఫోటోలు లేదా వీడియోలు తీయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ నియమం మొత్తం ఎయిర్‌పోర్టుతోపాటు విమాన నిర్వహణ ప్రదేశాలకు కూడా వర్తిస్తుంది. అంతేకాకుండా పాకిస్తాన్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఈ నియమాన్ని అన్ని ఎయిర్‌లైన్స్, విమానయాన సంస్థలకు వర్తింపజేసింది.
ఫోటోలు, వీడియోలు తీయడానికి ఎవరికి అనుమతి ఉంది
ఎవరెవరు ఫొటోలు, వీడియోలు తీయాలో కూడా పాకిస్తాన్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ తన నిర్ణయంలో స్పష్టంగా పేర్కొంది, పాకిస్తాన్‌లో ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన ఇంజనీర్లు, నిర్వహణ కార్మికులు మాత్రమే విమాన నిర్వహణ సమయంలో ఫోటోలు లేదా వీడియోలను షూట్ చేయాలి. వారే ఈ హక్కు కలిగి ఉంటారు. అది కూడా అవసరమని భావించినప్పుడు మాత్రమే. లేకపోతే, అదనంగా ఫోటోలు , వీడియోలు తీసిన వ్యక్తిపై చర్య తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అదే సమయంలో పాకిస్తాన్‌లో ఇప్పుడు ఈ నిర్ణయాన్ని పూర్తిగా అమలు చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంది.
PAA ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకుంది?
పాకిస్తాన్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకుంది అంటే… కొంతకాలం క్రితం పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) విమానం ఫోటో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయ్యింది. ఈ ఫోటో వైరల్ అవ్వడంతో పాకిస్తాన్‌కు చాలా అవమానం జరిగింది. అందుకే పాకిస్తాన్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఈ నిర్ణయాన్ని అమలు చేసింది.
మరిన్ని చూడండి