ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 16 టీఎంసీలు, మిడ్ మానేర్ రిజర్వాయర్ లో 9 టీఎంసీలు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 9 టీఎంసీల నీళ్లు ఉన్నాయని తెలిపారు. మేడిగట్ట వద్ద కాపర్ డ్యాం నిర్మించి నీటిని ఎత్తి పోయడమో లేదా ఎస్సారెస్పీ నుంచి ఎల్ఎండికి నీటిని విడుదల చేయడమో చేయాలని డిమాండ్ చేశారు. ఎల్ఎండిలో కావాల్సినంత నీటిని నిలువ చేయకుంటే వారం పది రోజుల్లో ఆందోళన చేపట్టక తప్పదని హెచ్చరించారు.