ప్రస్తుత విద్యా వ్యవస్థలో లోపాలు, తీసుకురావల్సిన సంస్కరణలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఉత్తమ విద్యా వ్యవస్థ ఏర్పాటుకు ఎంత ఖర్చయినా వెనుకాడబోదని స్పష్టం చేశారు. మెరుగైన విద్యా వ్యవస్థ రూపకల్పనకు సమగ్ర విధాన పత్రం రూపొందించాలన్నారు.