IPL Bettings: మెదక్ జిల్లాలో ఎవరైనా క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడినా, ప్రోత్సహించినా వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఇటీవల కాలంగా రాష్ట్రంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో యువత క్రికెట్ బెట్టింగ్ వలలో చిక్కుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు.