ByGanesh
Thu 10th Apr 2025 11:43 AM
ప్రస్తుతం మాస్ ట్రెండ్ అంటూ స్టార్ హీరోలు, పాన్ ఇండియా స్టార్స్ నుంచి మూవీ అప్ డేట్స్ అన్ని మాస్ పోస్టర్స్ ని వదులుతూ అభిమానులను సర్ ప్రైజ్ చేస్తూ ఆనందపరుస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో మెగా హీరోలైన రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇచ్చిన మాస్ ట్రీట్ అభిమానులనే కాదు మాస్ ఆడియన్స్ అందరిని విపరీతంగా ఇంప్రెస్స్ చేసాయి.
ఈలోపులో ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ నుంచి అప్ డేట్ అనగానే అందరూ ఆ మాస్ రేంజ్ లోనే అప్ డేట్ ఉంటుంది అని ఊహించుకున్నారు. తీరా చూస్తే జస్ట్ ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యే తేదీని మాత్రమే ప్రకటించారు. ఏప్రిల్ 22 నుంచి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులోకి ఎంటర్ అవుతారని మేకర్స్ సింపుల్ అప్ డేట్ ఇచ్చారు.
ఎన్టీఆర్ నీల్ సెట్స్ లోకి జాయిన్ అవడం హ్యాపీ అయినా, ఆ ఆప్ డేట్ అంత సింపుల్ గా తేలిపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో అసంతృప్తి మొదలయ్యింది. అసలే చరణ్ పెద్ది లుక్, అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్ అనౌన్సమెంట్ చూసాక ఎన్టీఆర్ అభిమానులకి ఎన్టీఆర్-నీల్ అప్ డేట్ అస్సలు నచ్చలేదు. ఆ అప్ డేట్ ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అవుతున్నారు కానీ.. మే 20 న ఎన్టీఆర్ బర్త్ డే కి వారు ఊహించని సర్ ప్రైజ్ ని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారట.
NTR fans unhappy with NTR-Neel update:
Big update on NTR-Neel update