Sonia, Rahul are completely immersed in the National Herald case | National Herald Case: జైలుకు సోనియా, రాహుల్ – ఇప్పుడిదే హాట్ టాపిక్

What is National Herald Case: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేతలు  సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలపై ఈడీ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది ఈ నెల 25వ తేదీన కోర్టు  ఈ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుని ట్రయల్ ప్రారంభిస్తుంది. అదే  జరిగితే.. ఏ వన్ గా ఉన్న సోనియా, ఏ టుగా ఉన్న రాహుల్ కు జైలు శిక్ష తప్పదన్న వాదన వినిపిస్తోంది. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసుగా కొట్టి పారేస్తున్నారు. 

నేషనల్ హెరాల్డ్ అనేది ఓ పత్రిక 

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెర్హూ హయాంలో నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక ప్రచురితమయ్యేది. ఈ పత్రిక  అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనే కంపెనీ  తరపున మార్కెట్ లోకి వచ్చేది.  1938లో ప్రారంభమైన వార్తాపత్రిక కంపెనీలో  5,000 మంది స్వాతంత్ర్య సమరయోధులు షేర్‌హోల్డర్లుగా ఉన్నారు. మొత్తం  మూడు పత్రికల్ని నడిపే సంస్థ క్రమంగా  నష్టాల్లోకి పోయింది.  2008 నాటికి దివాలా తీసింది.  పత్రికల ప్రచురణ నిలిచిపోయింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి  90 కోట్లకుపైగా బాకీ పడింది. 

2010లో యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ను ప్రారంభించిన సోనియా రాహుల్

2008లో నేషనల్ హెరాల్డ్ మూతపడిన తర్వాత 2010 నవంబర్‌లో యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్  అనే లాభాపేక్ష లేని కంపెనీని ప్రారంభించారు.  ఇందులో  సోనియా గాంధీ ,  రాహుల్ గాంధీలకు తలా 38 వాటా అంటే  మొత్తం 76 శాతం వాటా  ఉంది. మిగిలిన 24 శాతం వాటా కాంగ్రెస్ నాయకులైన మోతీలాల్ వోరా , ఆస్కార్ ఫెర్నాండెస్ , జర్నలిస్ట్ సుమన్ దుబే, కాంగ్రెస్ నేత సామ్ పిట్రోడాలకు ఉన్నాయి. నేషనల్ హెరాల్డ్ ను ప్రచురించి కంపెనీ అయి ఏజెఎల్ కాంగ్రెస్ పార్టీకి 90 కోట్లకుపైగా ఇవ్వాల్సి ఉన్నందున ఆ రుణాన్ని రూ.50 లక్షలకు యంగ్ ఇండియాకు బదలాయించింది.  అంటే AJLకు చెందిన  2,000 కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ ఆస్తులు  YIL నియంత్రణలోకి వచ్చాయి.  అంటే 50 లక్షలతో రెండు వేల కోట్ల ఆస్తులు స్వాధీనం చేసుకున్నారన్నమాట. 

అసలైన మనీలాండరింగ్ అన్న  ఈడీ 

సుబ్రమణ్యం స్వామి 2012లో ఢిల్లీ కోర్టులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులపై ఢిల్లీ హైకోర్టులో ప్రైవేట్ క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేశారు.   ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ కోర్టు ఆదాయపు పన్ను విభాగానికి నేషనల్ హెరాల్డ్ వ్యవహారాలను పరిశీలించేందుకు అనుమతించింది. ఈ ఆదేశం ఆధారంగా, ED 2021లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్  కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. 2,000 కోట్ల ఆస్తులను రాహుల్, సోనియాల అధీనంలోని యంగ్ ఇండియా  50 లక్షలకు స్వాధీనం చేసుకోవడం ఒక “క్రిమినల్ కుట్ర” అని ED ఆరోపించింది. ఈ ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 5,000 కోట్లుగా అంచనా వేశారు. అందుకే ఇది ఐదు వేల కోట్ల స్కాంగా ఈడీ చెబుతోంది. 

మనీ లేని మనీ లాండరింగ్ కేసు అంటోన్న  కాంగ్రెస్

అయితే ఈ నేషనల్ హెరాల్డ్ కేసును   కుట్రపూరిత కేసుగా కాంగ్రెస్ చెబుతోంది.  డబ్బు లేని మనీ లాండరింగ్ కేసు”గా కాంగ్రెస్ అభివర్ణించింది.   ఎవరూ మోసపోయినట్లు ఫిర్యాదు చేయలేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఈ చర్యలను రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తూ, చట్టపరమైన , రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించింది. కోర్టు తీర్పు ఎలా వస్తుందో కానీ సోనియా, రాహుల్ మాత్రం కఠిన పరీక్షను ఎదుర్కొంటున్నారని అనుకోవచ్చు. 

మరిన్ని చదవండి

మరిన్ని చూడండి

Source link