Bobby Deol Turns 56 – Actor Journey Of Highs జీరో అయిపోయిన న‌టుడికి మ‌హ‌ర్థ‌శ‌


Thu 17th Apr 2025 10:34 AM

bobby deol  జీరో అయిపోయిన న‌టుడికి మ‌హ‌ర్థ‌శ‌


Bobby Deol Turns 56 – Actor Journey Of Highs జీరో అయిపోయిన న‌టుడికి మ‌హ‌ర్థ‌శ‌

అత‌డు ఇండ‌స్ట్రీ లెజెండరీ హీరో కుమారుడు. అంద‌రు న‌ట‌వార‌సుల్లానే గ్రాండ్ గా సినీప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు.  ఆరంభం మంచి బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకున్నాడు. వ‌రుస చిత్రాల్లో న‌టించాడు. కానీ అత‌డి జోరు ఎక్కువ కాలం కొన‌సాగ‌లేదు. వ‌రుస ఫ్లాపులు రావ‌డంతో పూర్తిగా జీరో అయిపోయాడు. కొన్నేళ్ల పాటు ఇంటికే ప‌రిమిత‌మ‌వ్వ‌డంతో అత‌డ‌ని ఇండ‌స్ట్రీ మ‌ర్చిపోయింది.

ఈ ప‌రిస్థితిలో డిప్రెష‌న్ లోకి కూడా వెళ్లిపోయాడు. తాగుడుకు బానిస‌య్యాడు. అయితే అలాంటి ప‌రిస్థితి నుంచి అత‌డు కోలుకోవ‌డానికి ఒక తెలుగు ద‌ర్శ‌కుడు పెద్ద లిఫ్ట్ ఇచ్చాడు. ఒకే ఒక్క సినిమాతో అత‌డి లైఫ్‌నే మార్చేసాడు. కెరీర్ ప‌రంగా బిజీయెస్ట్ న‌టుడిని చేసాడు. ఇప్పుడు ఏడాదికి అర‌డ‌జ‌ను సినిమాల్లో న‌టిస్తూ, ఒక్కో సినిమాకి 2-3కోట్లు అందుకుంటూ సంవ‌త్స‌రానికి 10కోట్లు వెన‌కేసుకుంటున్నాడు. ఇటీవ‌ల వ‌రుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.

పూర్తిగా జీవం చ‌చ్చి ఇక కోలుకోలేడు అనుకున్న న‌టుడు ఇప్పుడు వేదిక‌ల‌పై వెలిగిపోతున్నాడు. తాజాగా మారిన త‌న స్టార్ డ‌మ్ ని ప్రెజెంట్ చేసేందుకు ఖ‌రీదైన రేంజ్ రోవ‌ర్ ని సొంతం చేసుకున్నాడు. దీనికోసం ఏకంగా 3కోట్లు ఖ‌ర్చు చేసాడు. ఇది దేశంలో ఏ ఇత‌ర సెల‌బ్రిటీకి లేని మోడ‌ల్. గంట‌కు 300 కిలోమీట‌ర్ల వేగంతో ప‌రిగెత్త‌గ‌లదు. ఈ ఖ‌రీదైన కార్ ని కొనుక్కున్న సంద‌ర్భంలో అత‌డు త‌న‌కు ఈ పున‌ర్జ‌న్మ‌నిచ్చిన ద‌ర్శ‌కుడిని తలుచుకున్నాడా లేదా? అన్నది అత‌డే చెప్పాలి. ఇంత‌కీ ఈ న‌టుడు ఎవ‌రో తెలుసా?  అత‌డే బాబి డియోల్. అత‌డికి యానిమ‌ల్ తో లిఫ్ట్ ఇచ్చిన తెలుగు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా.


Bobby Deol Turns 56 – Actor Journey Of Highs:

Bobby Deol Says He Got Animal 





Source link