కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన నలుగురు మృతి

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం జరిగింది. వంతెన గోడను వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు హిందూపురానికి చెందిన నాగభూషణ్‌, నాగరాజు, సోమ, మురళిగా గుర్తించారు. హిందూపురం నుంచి కర్ణాటకలోని యాద్గిర్‌ జిల్లా షహర్‌పూర్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

Source link