Viral Video Father Takes Scooter Into Hospital Lift Upon Unavailability Of Wheelchair For Son | Viral Video: హాస్పిటల్ లిఫ్ట్‌లోకి స్కూటర్, వీల్‌ఛైర్ లేదని కొడుకుని ఇలా తీసుకెళ్లాడు

Viral Video: 

కోటాలోని ఆసుపత్రిలో ఘటన..

రాజస్థాన్‌లోని కోటాలో ఓ ఆసుపత్రిలో జరిగిన ఓ ఘటన వైరల్ అవుతోంది. ఓ అడ్వొకేట్ తన కొడుక్కి కాలు విరిగితే ఆసుపత్రికి తీసుకొచ్చాడు. హాస్పిటల్‌లో వీల్‌ ఛైర్ లేదు. పైకి తీసుకెళ్లడం ఎలా అని ఆలోచించి వెంటనే తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ని తీసుకొచ్చాడు. దానిపై కొడుకుని కూర్చోపెట్టుకుని నేరుగా లిఫ్ట్‌లోకి తీసుకెళ్లాడు. అలా బైక్‌పైనే లిఫ్ట్‌లో మరో ఫ్లోర్‌కి తీసుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హాస్పిటల్ సిబ్బంది అనుమతితోనే ఇలా చేశానని చెప్పాడు అడ్వకేట్ మనోజ్ జైన్. 

“చాలా సేపటి వరకూ నేను వీల్‌ ఛైర్ కోసం చూశాను. అది అందుబాటులో లేదు. చాలా సేపు చూసి ఆ తరవాత హాస్పిటల్ సిబ్బందిని అడిగాను. ఇక్కడి పేషెంట్స్‌కి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా బైక్‌ని తీసుకొస్తానని చెప్పాను. పైగా నాది ఎలక్ట్రిక్ స్కూటర్. అందుకే అడిగాను. లిఫ్ట్‌లోకి తీసుకెళ్లొచ్చా అని అడిగితే వాళ్లు ఒప్పుకున్నారు. అందుకే తీసుకొచ్చాను. ఆ తరవాత వాళ్లు నా స్కూటర్ కీస్ తీసుకెళ్లిపోయారు. వాళ్లు తిరిగి ఇస్తారేమో అని చాలా సేపు ఓపిగ్గా వేచి చూశాను”

– మనోజ్ జైన్

అయితే…అటు సిబ్బంది మాత్రం కేవలం హాస్పిటల్ గేట్ వరకే స్కూటర్ తీసుకొచ్చేందుకు పర్మిషన్ ఇచ్చామని, ఆయన ఏకంగా లిఫ్ట్‌లోకే తీసుకొచ్చాడని చెబుతోంది. 

“మనోజ్ జైన్ తన కొడుకు కోసం వీల్ ఛైర్ అడిగారు. ఆ సమయంలో అది అందుబాటులో లేదు. గేట్‌ వరకూ స్కూటర్‌పై రావచ్చని సిబ్బంది చెప్పింది. కానీ ఆయన ఏకంగా లిఫ్ట్‌లోకే తీసుకొచ్చారు. స్కూటర్‌లను ఎప్పుడూ లిఫ్ట్‌లోకి అనుమతించం”

– కర్ణేశ్ గోయల్, హాస్పిటల్ సూపరింటెండెంట్ 

 

Source link