A common point in Sankranthi releases సంక్రాంతి రిలీజుల్లో కామన్ పాయింట్

ప్రతి సంక్రాంతికి బాక్సాఫీసు పోటీ రంజుగానే కనిపిస్తుంది. కానీ ఈ సంక్రాంతి పోటీ మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది. కొంతమంది మమ్మల్ని తప్పుకోమని బెదిరిస్తున్నారంటే, మరికొంతమంది మాకు థియేటర్స్ ఇవ్వకపోయినా ఏం పర్లేదు.. సంక్రాంతికి వచ్చేది వచ్చేదే.. అంటున్నారు. ఇంకొంతమంది మాత్రం సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటున్నారు. జనవరి 12 న గుంటూరు కారం, హనుమాన్ రిలీజ్ అవుతున్నాయి. 13 న సైంధవ్‌ విడుదలకు రెడీ అవుతుంది. ఇక 14 న నా సామిరంగా దిగుతుంది. 13నే రావాల్సిన ఈగల్ ని నిర్మాతలు వాయిదా వేసుకున్నారు.

ఈ నాలుగు సినిమాల్లో ఎవ్వరూ ముందుకి వెనక్కి జరగమంటున్నారు. హనుమాన్ పోనీ జనవరి 11 న రావొచ్చు కదా అంటే.. కుదరదు.. మాకు అగ్రిమెంట్స్ అయ్యాయంటున్నారు. ఇక ఈగల్ వాయిదా అనే న్యూస్ ని కొట్టి పారేస్తూనే చివరకి వాయిదా వేశారు. మధ్యలో హనుమాన్ మేకర్స్.. మమ్మల్ని తప్పుకోమని కొందరు బెదిరిస్తున్నారు అంటున్నారు. ఇంతిలాంటి గోలలో పండగకి రాబోయే సినిమాల్లో ఒకటే కామన్ పాయింట్ కనిపిస్తుంది. అదేమిటంటే గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్‌, నా సామిరంగా ఈ నాలుగు సినిమాలకు సెన్సార్ వారు యు/ఏ సర్టిఫికెట్ ఇవ్వడం.

ఈ సెన్సార్ సర్టిఫికెట్ నాలుగు సినిమాలతో పాటుగా ఇప్పుడు తప్పుకున్న ఈగల్ సినిమాకి ఒకటే రావడం అందరిలో ఆసక్తిని కలిగించింది. గుంటూరు కారం సెన్సార్ కంప్లీట్ అంటూ యు/ఏ సర్టిఫికెట్ తో పోస్టర్ వదిలారు. అలాగే హనుమాన్ కి కూడా యు/ఏ వచ్చింది. ఇక ఈగల్, సైంధవ్‌ కి కూడా యు/ఏ నే. నా సామిరంగాకి ఇంకా సెన్సార్ పూర్తి కాకపోయినా దానికి యు/ఏ వచ్చింది అంటున్నారు. మరి ఎలాంటి జోనర్స్ లో ఏ సినిమాలు వచ్చినా ప్రేక్షకులు మాత్రం యు/ఏ సర్టిఫికెట్ సినిమాలే చూడాలన్నమాట.

1.12th GunturKaaram – U/A

2. 12th Hanuman – U/A

3. 13th Saindhav – U/A

4. 13th Eagle – U/A

5.14th NasamiRanga U/A (No censor present)

Source link