a man died after his friends pelted him with tapas in bengalore | Frank Challenge: టపాసులపై స్టీల్ బాక్స్ పెట్టి వ్యక్తిని కూర్చోబెట్టారు

Man Dies Due To Prank With Tapas In Bengaluru: ఓ వ్యక్తికి స్నేహితులు విసిరిన సవాల్ అతని ప్రాణాల మీదకు తెచ్చింది. స్టీల్ బాక్స్‌పై టపాసులు పెట్టి దానిపై కూర్చుంటే ఆటో రిక్షా కొనిస్తామని స్నేహితులు చెప్పడంతో సదరు వ్యక్తి అలానే చేశాడు. చివరకు తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. బెంగుళూరులోని (Bengaluru) కోననకుంటె పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోననకుంటె వీవర్స్ కాలనీలో శబరీష్ అనే వ్యక్తికి అతని స్నేహితులు ఛాలెంజ్ విసిరారు. స్టీల్ బాక్స్‌ కింద టపాసులు పెట్టి దానిపై కూర్చుంటే ఆటో రిక్షా కొనిస్తామని చెప్పారు. మద్యం మత్తులో ఉన్న శబరీష్ అలానే చేయడంతో క్రాకర్లు పేలి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 2వ తేదీన మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కాగా, దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Also Read: IAF Fighter Jet Crash: కుప్పకూలిన ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ మిగ్ 29, విచారణకు డిఫెన్స్ శాఖ ఆదేశాలు

మరిన్ని చూడండి

Source link