A Photo of Rahul Gandhi with children of Congress leader is a false claim of a secret marriage

Congress Leader Rahul Gandhi News- కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీక్రెట్ ఫ్యామిలీ అంటూ క్లెయిమ్ చేస్తూ ఓ ఫొటో సోషల్ మీడియాలో (ఇక్కడఇక్కడఇక్కడ) వైరల్ అవుతోంది. దాచేస్తే నిజాలు దాగుతాయా? ఎప్పటికైనా విత్తనం పుడమిని చీల్చుకుంటూ బయటకు వచ్చేస్తాయని పేర్కొంటూ.. తను నలుగురు పిల్లలతో రాహుల్ గాంధీ అని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీకి సంబంధించి నిజాలు అని ఫొటో వైరల్ అయింది. మరోవైపు రాహుల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు.

Fact Check: దాచేస్తే నిజాలు దాగుతాయా? సీక్రెట్ ఫ్యామిలీతో రాహుల్ గాంధీ! వైరల్ ఫొటోలో నిజమెంత

క్లెయిమ్: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన సీక్రెట్ ఫ్యామిలీతో దిగిన ఫోటో అని ప్రచారం జరిగింది. 

ఫాక్ట్ (నిజం): ఆ ఫొటోలో కనిపించింది రాహుల్ గాంధీ కుటుంబం కాదు. రాజస్థాన్‌లోని బరన్ జిల్లాకి చెందిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రియాంక నంద్వానా పిల్లలు రాహుల్ గాంధీతో పాటు ఫోటోలో కనిపించారు. కాంగ్రెస్ నేత కూతురు కామాక్షి నంద్వానా తనను కలవాలనుకుంటుందని తెలుసుకున్న రాహుల్ గాంధీ, 2022లో తన భారత్ జోడో యాత్రలో వారిని హెలికాప్టర్‌ రైడ్‌కు తీసుకెళ్లారు. ఆ సమయంలో తీసిన ఫొటోపై దుష్ప్రచారం జరిగింది. ఆ వైరల్ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు అని నిర్ధారణ అయింది. 

ఆ వైరల్ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ఫ్యాక్ట్‌లీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ పరిశీలించింది. 9 డిసెంబర్ 2022న ఇదే ఫోటోతో ఉన్న ఒక యూట్యూబ్ వీడియో రిపోర్ట్ కనిపించింది. అందులో రాహుల్ గాంధీతో కనిపించిన పిల్లలు రాజస్థాన్‌లోని బరన్ జిల్లాకి చెందిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రియాంక నంద్వానా సంతానం అని కనిపించింది. ఈ కింద ఫోటోలో ప్రియాంక నంద్వానా ఫ్యామిలీని చూడవచ్చు. 

Fact Check: దాచేస్తే నిజాలు దాగుతాయా? సీక్రెట్ ఫ్యామిలీతో రాహుల్ గాంధీ! వైరల్ ఫొటోలో నిజమెంత

రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా బుండిలోని నైనాని ఫామ్ నుంచి సవాయ్ మాధోపూర్‌కు వెళ్తున్నారు. ఈ సందర్భంగా, ప్రియాంక నంద్వానా కూతురు కామాక్షి నంద్వానా తనను కలవాలనుకున్నట్లు రాహుల్ గాంధీకి తెలిసింది. కామాక్షి 14వ పుట్టినరోజు సందర్భంగా రాహుల్ గాంధీ వెళ్లి ఆమెను కలిశారు. తనను కలవాలన్న కోరిక నెరవేర్చడంతో పాటు, నంద్వానా నలుగురు పిల్లలని హెలికాప్టర్ రైడ్‌లో తీసుకెళ్లారు.

Fact Check: దాచేస్తే నిజాలు దాగుతాయా? సీక్రెట్ ఫ్యామిలీతో రాహుల్ గాంధీ! వైరల్ ఫొటోలో నిజమెంత

 

వైరల్ అవుతున్న ఫోటోకు సంబంధించిన సమాచారాన్ని వేరే వార్త లో అదే ఫొటోతో చూడవచ్చు. ఇవన్నీ గమనిస్తే ఆ పిల్లలు రాహుల్ గాంధీ సంతానం కాదు అని తేలింది. రాజస్థాన్‌లోని బరన్ జిల్లాకి చెందిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నంద్వానా పిల్లలు అని స్పష్టమైంది. 

Fact Check: దాచేస్తే నిజాలు దాగుతాయా? సీక్రెట్ ఫ్యామిలీతో రాహుల్ గాంధీ! వైరల్ ఫొటోలో నిజమెంత

వైరల్ అయిన ఫొటోలో రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న అమ్మాయి మీడియాతో మాట్లడడాన్ని ఇక్కడ చూడవచ్చు. కాంగ్రెస్ పార్టీ మహిళా నేత పిల్లలతో దిగిన ఫొటోను రాహుల్ గాంధీ సీక్రెట్ ఫ్యామిలీ ఫొటో అని దుష్ప్రచారం జరిగినట్లు తేలింది. 

This story was originally published by Factly, as part of the Shakti Collective. This story has been edited by ABP Desam staff.

మరిన్ని చూడండి

Source link