Maoist Encounter : మహారాష్ట్రలోని గడ్చిరోలి అటవీ ప్రాంతంలో తుపాకులు గర్జించాయి. పోలీసులకు, మావోయిస్టులకు మద్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. గత కొన్ని రోజులుగా మావోయిస్టులు ఉంటున్న కీలక స్థావరాలను టార్గెట్ చేసుకొని భద్రతాబలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపడుతున్నారు. వారి నుంచి తప్పించుకునేందుకు మావోయిస్టులు తుపాకులకు పని చెబుతుండటంతో కాల్పులు జరుగుతున్నాయి.
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో మంగళవారం భద్రతాదళాలకు, మావోయిస్టులకు కాల్పులు జరిగాయి. గడ్చిరోలిలో జరిగిన ఘటనలో ఓ జవాను గాయపడ్డాడు. స్పెషల్ ఆపరేషన్స్ టీం గడ్చిరోలికి చెందిన మహేష్ నాగుల్వర్ తీవ్రంగా గాయపడ్డారు. 39 సంవత్సరాలకు చెందిన మహేష్‌ను హెలికాప్టర్‌లో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించాడు.
మహేష్ స్వస్థం గడ్చిరోలి జిల్లాలోని తాలూకా చమోర్షికి చెందిన అంకోడ గ్రామం. గడ్చిరోలిలోని జనరల్ హాస్పిటల్ చికిత్స పొందుతూ చనిపోయారు. అతన్ని బుధవారం అంకోడకు తరిలంచి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆయన మరణాన్ని తోటి జవానులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
గత వారంలోనే ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. దాదాపు 30 మంది మావోయిస్టులు మృతి చెందారు.
Also Read: ఆంధ్రప్రదేశ్‌లో వాట్సాప్ ద్వారా క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
మరిన్ని చూడండి