Ideas Of India 2025: ABP నెట్వర్క్ నిర్వహించే ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025 నాల్గో ఎడిషన్ ప్రారంభమైంది. ప్రార్థనా గీతంతో ప్రారంభమైన సమ్మిట్‌లో ABP నెట్వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్ స్వాగత ప్రసంగం చేసి కార్యక్రమంలో నూతన ఉత్సాహాన్ని నింపారు. మారుతున్న కాలానికి అనుకుంగా మారాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. మానవత్వం, మౌలిక సూత్రాలను విడిచిపెట్టకుండా కొత్త దనం అందిపుచ్చుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 21, 22 అంటే రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వివిధ రంగాల నుంచి చాలా మంది ప్రముఖులు వచ్చి తమ ఆలోచనలు పంచుకుంటున్నారు. దేశాన్ని మరింత వేగంగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన వినూత్న ఆలోచనలు వివరిస్తున్నారు.
గాయని, స్వరకర్త సంజీవని భేలాండే సరస్వతి వందన కార్యక్రమంతో ఐడియా ఆఫ్ ఇండియా ప్రారంభమైంది. రచయిత పికో అయ్యర్ ‘ఐడియా ఆఫ్ ఇండియా’కి మొదటి అతిథిగా తన అభిప్రాయాలు వెల్లడించారు. పికో అయ్యర్ భారతీయ సంతతికి చెందిన బ్రిటిష్ రచయిత. టిబెట్ బహిష్కరించబడిన ఆధ్యాత్మిక నాయకుల గురించి, క్యూబా నిర్బంధ సమాజం గురించి ఇలా సామాజిక అంశాలను తీసుకొని 10కిపైగా పుస్తకాలు శారు.
ప్రస్తుతం ఈ కార్యక్రమం ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్లో జరుగుతుంది. ఈ సమ్మిట్ ABP లైవ్ (యూట్యూబ్, ఫేస్బుక్) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.
ప్రత్యక్ష ప్రసారం కోసం, అన్ని అప్డేట్ల కోసం మీరు telugu.abplive.com ని సందర్శించవచ్చు.
మరిన్ని చూడండి