ACB Trap : పాల బిల్లు చెల్లింపులకు లంచం డిమాండ్

గతంలో ఆరోపణలు.. అయినా కీలక బాధ్యతలు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో గతంలో జరిగిన అక్రమాల్లో ఆరోపణలు మోసిన కిష్టయ్యకు మళ్లీ కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల వర్సిటీ ఉన్నతాధికారులపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. దాదాపు ఏడెనిమిదేళ్ల కిందట యూనివర్సిటీలో విద్యార్థుల ట్యూషన్ ఫీజులు, ఇతర రుసుముల స్వీకరణలో జరిగిన మూడు కోట్ల కుంభకోణంలో ఏఆర్ కిష్టయ్య తో పాటు ప్రిన్సిపల్ అయిలయ్య పై విచారణ కమిటీ వేశారు. ఆ కమిటీ ఉండగానే ఏఆర్ కిష్టయ్య ను కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ కు వీసీ రమేశ్​ మార్చారు. న్యాక్ కోసం కేటాయించిన రూ.10 కోట్ల బిల్లులపై చేతి వాటం కొరకే కిష్టయ్యను క్యాంపస్ కు వీసీ రమేష్ బదిలీ చేయించారని గతంలో ఆరోపణలు వచ్చాయి.
న్యాక్ సందర్శన సందర్భంగా వర్సిటీలో రోడ్లు, హాస్టళ్లు, ఇతర బిల్డింగ్ ల కోసం రూ.10 కోట్ల కేటాయించగా.. వీటిలో కమీషన్ల కోసమే బిల్డింగ్ డివిజన్, పబ్లికేషన్స్ సెల్, హాస్టల్ ఆఫీస్ లతో బాటు యూనివర్సిటీ ఆడిట్ ఆఫీస్ కు కూడా కిష్టయ్య నే అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా నియమించినట్లు ఆరోపణలున్నాయి. గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న అధికారికే మళ్లీ కీలక బాధ్యతలు అప్పగించడం వెనుక వర్సిటీకి చెందిన ఉన్నతాధికారుల హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది. హాస్టల్ పాలు అమ్మే వ్యాపారి దగ్గరి నుంచే రూ.50 వేలు లంచం తీసుకోవడంతో తెరవెనుక పెద్ద తిమింగలాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.

Source link