Affair with Hyderabad woman gets UK university vice-chancellor suspended: గురువు స్థానంలో ఉండటం గొప్ప కాదు ఆ స్థాయిని నిలబెట్టేలా ప్రవర్తన ఉండాలి లేకపోతే అభాసు పాలవుతారు. ఈ యూకే వైస్ చాన్సలర్ ను చూస్తే అదే నిజమని మరోసారి అంగీకరించాలి.
యూకేలోని బంకింగ్‌హామ్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ గా జేమ్స్ టూలే అనే పెద్ద మనిషి వ్యవహరిస్తున్నారు. ఆయనను గత అక్టోబర్‌లో సస్పెండ్ చేశారు. ఎందుకు చేశారో ఎవరికీ తెలియలేదు. కానీ ఆసలు విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. అరవై ఐదు ఏళ్ల జేమ్స్ టూలే దారి తప్పాడు. యూనివర్శిటీలో చదువుకుంటున్న ఓ పాతికేళ్లలోపు అమ్మాయిని చెరబట్టాడు. ఈ విషయం ఆయన భార్యనే యూనివర్శిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో విచారణ జరిపి నిజమని నిర్దారించి సస్పెండ్చేశారు.
Also Read: అంతా చర్చ్ నన్ అనుకున్నారు కానీ అసలు మాఫియా లీడర్ – ఈ ఇటలీ మహిళా డాన్ స్టోరీ అచ్చం హాలీవుడ్ సినిమానే !
సస్పెండెడ్ వీసీ జేమ్స్ టూలే ..యూనివర్శిటీలో చదువుకుంటున్న అమ్మాయిని ప్లాన్డ్ గా లొంగ దీసుకున్నారని భావిస్తున్నారు. మొదట్లో ఆ అమ్మాయి ఫీజుల ఖర్చులు, ఇతర అవసరాలు చూసేవారు. తర్వాత అదే అదనుగా శారీరక సంబంధం పెట్టుకున్నారు. ఆ అమ్మాయికి మరో ఆప్షన్ లేకుండా చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. వైస్ చాన్సలర్ జేమ్స్ టూలే తనతో ఇలా ప్రవర్తిస్తున్నాడని.. లైంగికంగా .. శారీరకంగా అనుభవిస్తున్నాడని తన భాదను ఆ విద్యార్థిని ఎవరితోనూ చెప్పుకోలేదు. కానీ తన డైరీలో రాసుకుంది. ఆ అమ్మాయి హైదరాబాద్ నుంచి చదువుకోవడానికి లండన్ వెళ్లింది.
అయితే ఓ సారి ఆ డైరీ వీసీ జేమ్స్ టూలే భార్య కంట పడింది. ఆమె వయసు కూడా 40ల్లోనే ఉంటుంది. అంటే 65 ఏళ్ల జేమ్స్ టూలే తన కంటే వాయసులో పాతికేళ్ల వరకు చిన్నది అయిన మహిళను పెళ్లి చేసుకున్నారు. 40ఏళ్లకుపైగా చిన్నది అయిన విద్యార్థినితో శారీరక సంబంధం పెట్టుకున్నారు. తన భర్త చేస్తున్న ఘోరాన్ని సహించలేకపోయిన టూలే ఆ డైరీలోని విషయాలను యూనివర్శిటీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. విచారణలో అది నిజమని తేలడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు
Also Read: విమానంలో ఆ జంట ఆగలేకపోయారు – నింగి నేల మధ్య పని పూర్తి చేశారు – అయితే క్యాబిన్ క్రూ చేసిన పనిని మాత్రం ఛీకొట్టాల్సిందే !
జేమ్స్ టూలేని యూనివర్శిటీ నుంచి సస్పెండ్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో జేమ్స్ టూలే స్పందించారు. తాను విద్యార్థిని శారీరకంగా లోబర్చుకోలేదని తనపై వస్తున్నవన్నీ ఆరోపణలేనన్నారు.క విచారణలో క్లీన్ గా బయటకు వస్తానని చెప్పుకున్నారు. ఈ వీసీ వ్యవహారం లండన్ లో హాట్ టాపిక్ గా మారింది.
మరిన్ని చూడండి