After 77 years Chotta Singh reunites with family in Pakistan | Chotta Singh: దేశ విభజన సమయంలో తప్పిపోయాడు – 77 ఏళ్ల తర్వాత కుటుంబం దగ్గరకు

After 77 years Chotta Singh reunites with family in Pakistan: అది దేశ విభజన సమయం. పంజాబ్ ప్రాంతం ఉద్రిక్తంగా ఉంది. ఎక్కడికక్కడ హింస చెలరేగుతోంది. దేశ విభజన కారణంగా పాకిస్తాన్ కు వెళ్లాలనుకున్న ముస్లింలు వెళ్లిపోవచ్చని ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది. వారి కోసం రైళ్లు ఉన్నాయి.కానీ అన్నీ కిక్కిరిసిపోతున్నాయి. పాకిస్తాన్ నుంచి వచ్చే వారు..  ఇక్కడి నుంచి వెళ్లేవారు అంతా గందరగోళం. రెండు వైపులా హింస. పంజాబ్ లోని ఓ కుటుంబం పాకిస్తాన్ వెళ్లిపోవాలని బయటకు వచ్చింది. అంతలోనే హింస. ఆ కుటుంబులోని ఓ పదేళ్ల బాలుడు వెంటనే వారి నుంచి విడిపోయి భయంతో పరుగెత్తుకుని  సమీపంలోని ఓ ఇంట్లో దాక్కున్నాడు. తర్వాత  ఏమయిందో తెలియదు. కానీ బాలుడికి ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడా కనిపించలేదు. ఇది  జరిగి 77 ఏళ్లయింది. 

77 ఏళ్ల తర్వాత.. పాకిస్తాన్‌లోని ఓ ప్రాంతం..
సోషల్ మీడియాలో అక్కడి వారు ఓ వీడియో చూశారు. అందులో చాటాసింగ్ అనే వ్యక్తి గురించి వివరిస్తున్నారు. దేశ విభజన సమయంలో తాము పంజాబ్ లోని ఫలానా గ్రామం నంచి పాకిస్తాన్ వెళ్లాలనుకున్నామని కానీ తాను తన కుటుంబసభ్యుల నుంచి విడిపోయామని ఇప్పుడు జీవితం చరమాంకంలో ఉన్నానని  తన వాళ్లను చూడాలనుకుంటున్నానని ఆ వీడియోలో ఉన్న  సందేహం. దేశ విభజన సమయంలో తమ పెద్దలు ఎలా వచ్చారో తెలుసుకున్న కొంత మంది  యువకులు ఆ వీడియోను తమ పెద్దలకు చూపించారు. వెంటనే ఆ చోటా సింగ్  తమ బషీరేనని గుర్తించారు. బషీర్ ను పాకిస్తాన్ తీసుకు వచ్చేందుకు  ప్రయత్నాలు ప్రారంభించారు.                         

రష్యాతో పెట్టుకుంటే అంతే – గూగుల్‌కు ప్రపంచంలో ఉన్న డబ్బు కంటే ఎక్కువ జరిమానా !

కొన్ని ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు చోటా సింగ్ అలియాస్ బషీర్ తన బంధువుల్ని చేరుకున్నారు. ఆయనకు తెలిసిన వారు అతి తక్కువ మందే.ఇప్పుడు చోటా సింగ్ వయసు 88 ఏళ్లు. ఆయన కంటే పెద్ద వయసు ఉన్న వాళ్లు మాత్రమే చోటా సింగ్ ను గుర్తు పట్టారు. మిగిలిన వారు ఆయన తమ బంధువనేని ఆదరించారు. చివరి క్షణాలు తమ కుటుంబం మధ్య జీవిస్తానని చోటా సింగ్ అనుకోలేకపోయారు.         

అమెరికా అధ్యక్ష భవన్‌ వైట్‌ హౌస్‌లో “ఓం జై జగదీష హరే” పాట- సోషల్ మీడియాలో వీడియో వైరల్

అసలు ఎలా విడిపోయారంటే.. పాకిస్తాన్ వెళ్లేందుకు అందరితో పాటు  బయలుదేరిన ఆ పిల్లవాడు.. అల్లర్ల సమయంలో ఆందోళనకు గురయ్యాడు. తనను తీసుకుని వెళ్తున్న పిన్నిని కొంత మంది  దుండగులు పీక కోసి చంపేయడంతో భయంతో అక్కడినుంచి పారిపోయాడు. మిగిలిన వారు ఎలాగోలా తప్పించుకుని పాకిస్తాన్ చేరుకున్నారు.ఆ పిల్లవాడు మాత్రం అక్కడే అనాథలా పెరిగారు. పేరు కూడా ఏమీ లేకపోవడంతో చోటాసింగ్ అని పిలిచేవాళ్లు. పెళ్లి కూడా చేసుకోకుండా ఇంత కాలం ఒంటరిగా గడిపాడు చోటాసింగ్. చివరికి బంధువుల్ని చేరుకున్నాడు. 

మరిన్ని చూడండి

Source link