AI-Generated Pics Of Elon Musk, Mark Zuckerberg’s ‘the Good Ending’ Goes Viral | Artifical Intelligence: ముస్తఫా ముస్తఫా అని బీచ్‌లో పాడుకుంటున్న జుకర్, మస్క్

Artifical Intelligence: 

AI పిక్స్ వైరల్..

ట్విటర్‌కి పోటీగా మార్క్ జుకర్ బర్గ్ Threads యాప్‌ని ఈ మధ్యే లాంఛ్ చేశాడు. అప్పటి నుంచి ఎలన్ మస్క్, జుకర్ బర్గ్ మధ్య బయటకు కనిపించని యుద్ధం కొనసాగుతూనే ఉంది. జుకర్‌ని కవ్విస్తూ కొన్ని సెటైరికల్‌ ట్వీట్‌లు చేశాడు మస్క్. జుకర్ బర్గ్ కాపీ క్యాట్ అంటూ కొందరు గట్టిగానే విమర్శిస్తుంటే…ఆ కామెంట్స్‌ని ఎంజాయ్ చేశాడు మస్క్. ఇద్దరి మధ్య వైరం పెరుగుతున్న క్రమంలోనే సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. AI జనరేటెడ్ పిక్స్‌ని చూసి నెటిజన్లు “వావ్” అంటున్నారు. ఇంతకీ అందులో ఏముందంటే…ఎలన్ మస్క్, జుకర్ బర్గ్ కలిసి బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ఒకరి చేతులు ఒకరు పట్టుకుని సముద్ర తీరంలో నడుస్తున్నారు. సడెన్‌గా చూస్తే ఇది నిజమేనేమో అనుకునేంత సహజంగా ఉన్నాయి ఈ AI ఫొటోలు. మరో హైలైట్ ఏంటంటే…జుకర్ బర్గ్, ఎలన్ మస్క్ ఒకరినొకరు హగ్ చేసుకున్న ఫొటో కూడా ఇందులో కనిపించింది. ఈ కొలేజ్‌కి “The Good Ending” అని క్యాప్షన్ పెట్టి షేర్ చేశారు. ఇద్దరూ కలిసిపోయి ఇలా ఫ్రెండ్లీగా ఉంటే ఎలా ఉంటుందో అనే థాట్‌తో ఈ AI పిక్స్‌ని జనరేట్ చేశారు. చాలా క్యాజువల్‌గా టీషర్ట్, జీన్స్‌లలో కనిపించారు ఈ ఫొటోల్లో. అలా ట్విటర్‌లో పెట్టారో లేదో వెంటనే వైరల్ అయిపోయాయి. ఏకంగా ట్విటర్ బాస్ ఎలన్ మస్క్ కూడా ఈ ఫొటోలపై స్పందించాడు. లాఫింగ్ ఎమోజీతో రియాక్ట్ అయ్యాడు. 

Source link