Akhil Naatu Naatu Dance at Dubai Event ఎన్టీఆర్ పాట అఖిల్ ఆట


Sun 23rd Feb 2025 04:15 PM

akkineni akhil  ఎన్టీఆర్ పాట అఖిల్ ఆట


Akhil Naatu Naatu Dance at Dubai Event ఎన్టీఆర్ పాట అఖిల్ ఆట

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ మొత్తం తమ తమ భార్యలతో కలిసి దుబాయిలో జరిగిన ఓ వెడ్డింగ్  లో పాల్గొన్నారు. దుబాయ్ లో ఓ వ్యాపారవేత్త పెళ్లి కోసం టాలీవుడ్ స్టార్స్ స్పెషల్ ఫ్లైట్స్ లో కదిలారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున తమ తమ భార్యలతో హాజరవడమే కాదు సూపర్ స్టార్ మహేష్ లేరు కానీ ఆయన భార్య నమ్రత, నాగ చైతన్య వైఫ్ శోభిత, వరుణ్ తేజ్ భార్య లావణ్య, చరణ్ వైఫ్ ఉపాసన, ఇంకా అఖిల్ తనకు కాబోయే భార్యతో, ఎన్టీఆర్ తన భార్య ప్రణతితో కలిసి ఈ వెడ్డింగ్ లో పాల్గొన్నారు. 

ప్రస్తుతం దుబాయ్ వెడ్డింగ్ లో స్టార్స్, వాళ్ళ భార్యలు సందడి చేసిన ఫొటోస్ వైరల్ అవుతుండగా.. తాజాగా ఈ పెళ్ళిలో అఖిల్ అక్కినేని తనకు కాబోయే భార్య జైనబ్ తో కలిసి సందడి చెయ్యడమే కాదు.. అఖిల్ ఎన్టీఆర్-చరణ్ నటించిన ఆర్.ఆర్.ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ కి ఎనేర్జిటిక్ తో స్టెప్స్ వేసిన వీడియో వైరల్ అయ్యింది. 

ప్రస్తుతం CCL మ్యాచ్ ల్లో ఇరగదీస్తున్న అఖిల్.. ఏజెంట్ తర్వాత తన తదుపరి చిత్రాన్ని ముర‌ళీ కిశోర్ అబ్బూరి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నారు.


Akhil Naatu Naatu Dance at Dubai Event:

Akkineni Akhil Naatu Naatu Dance at Private Party in Dubai





Source link