Akhil Wedding Preparations Begin మొదలు కాబోతున్న అఖిల్ పెళ్లి పనులు


Thu 30th Jan 2025 02:29 PM

akhil marriage  మొదలు కాబోతున్న అఖిల్ పెళ్లి పనులు


Akhil Wedding Preparations Begin మొదలు కాబోతున్న అఖిల్ పెళ్లి పనులు

అక్కినేని ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగేందుకు రెడీ అవుతుంది. ఇప్పటికే నాగ చైతన్య పెళ్లిని గ్రాండ్ గా నిర్వహించిన అక్కినేని కుటుంబం ఇప్పుడు అఖిల్ పెళ్లి కోసం ప్రిపేర్ అవుతుంది. మార్చి 24 న అఖిల్ – జైనబ్ ల వివాహానికి నాగార్జున ఇంకా జైనబ్ ల పేరెంట్స్ ముహూర్తం నిశ్చయించినట్టుగా వార్తలు ఉన్నాయి. 

అఖిల్ పెళ్లి కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే గ్రాండ్ గా వెడ్డింగ్ సెట్ వేసి నిర్వహించేందుకు అక్కినేని నాగార్జున ఏర్పాట్లు చేస్తున్నారని ఒకరు, కాదు అఖిల్-జైనబ్ ల వివాహాన్ని జైనబ్ ఫ్యామిలిలో దుబాయ్ వేదికగా నిర్వహిస్తారని కొందరు మాట్లాడుతున్నారు. ఎక్కడ జరిగినా అంగరంగ వైభవంగా అఖిల్-జైనబ్ ల వివాహం జరగనుంది అని విశ్వసనీయ సమాచారం. 

నాగార్జున, నాగ ఛైతన్య-శోభిత లు ప్రత్యేకంగా అఖిల్ పెళ్లి ఏర్పాట్లు చేయబోతున్నట్లుగా టాక్ ఉంది. అఖిల్ ని ఎప్పుడెప్పుడు పెళ్లి కొడుకుగా చూస్తామో అని అక్కినేని ఫ్యాన్స్ చాలా క్యూరియాసిటీగా ఉన్నారు. 


Akhil Wedding Preparations Begin:

Akhil Akkineni Wedding Plans in Motion





Source link