ByGanesh
Sat 02nd Nov 2024 12:44 PM
బాలీవుడ్ బ్యూటిఫుల్ జంట రణబీర్ కపూర్-అలియా భట్ లు ఇద్దరూ ముద్దులొలికే కూతురు రహా తో కలిసి టైమ్ స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఓ ఏడాది వరకు తమ కుమార్తె పిక్ ని కానీ, ఆమె ఫేస్ కానీ రివీల్ చెయ్యని అలియా-రణబీర్ కపూర్ లు పాపకి ఏడాది పూర్తయిన సందర్భంగా తమ కుమార్తెను అభిమానులకు పరిచయం చేసారు.
అప్పటి నుంచి రాహ ని ఓపెన్ గానే వెకేషన్స్ కు, అలాగే పార్టీలకు తీసుకెళుతూ ముగ్గురు సందడి చేస్తున్నారు. తాజాగా దీపావళి సందర్భంగా రణబీర్ కపూర్-అలియా భట్ లు తమ కూతురు రహ తో, అలాగే రణబీర్ కపూర్ ఫ్యామిలీతో కలిసి ఎలా సెలెబ్రేట్ చేసుకున్నారో ఆ పిక్ ని అభిమానుల కోసం షేర్ చేసారు.
ఫెస్టివల్ లుక్ లో రణబీర్-అలియా భట్ రాహా లు మెరిసిపోయారు. గోల్డ్ కలర్ కాస్ట్యూమ్స్ లో ముగ్గురు కనిపించగా.. రాహా చేతితో దీపం పెట్టిస్తూ అలియా-రణబీర్ జంట మురిసిపోయిన ఆ బ్యూటిఫుల్ పిక్స్ నెట్టింట సంచలనంగా మారింది.
Alia Bhatt And Ranbir Kapoor Twin With Daughter Raha:
Alia Bhatt And Ranbir Kapoor Twin With Daughter Raha For Diwali Puja