Allu fans have to wait అల్లు ఫ్యాన్స్ వెయిట్ చెయ్యాల్సిందే


Thu 13th Mar 2025 01:39 PM

allu arjun  అల్లు ఫ్యాన్స్ వెయిట్ చెయ్యాల్సిందే


Allu fans have to wait అల్లు ఫ్యాన్స్ వెయిట్ చెయ్యాల్సిందే

ఏప్రిల్ 8 వరకు అల్లు ఫ్యాన్స్ కు వెయిటింగ్ తప్పదు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో మొన్నటివరకు క్లారిటీ ఉన్నా ఇప్పుడు అది కన్ఫ్యూజన్ కింద తయారైంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చెయ్యాల్సి ఉండగా.. మధ్యలోకి కోలీవుడ్ దర్శకుడు అట్లీ వచ్చి చేరడంతో అల్లు ఫ్యాన్స్ లో అయోమయం, గందరగోళం. 

అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్ జూన్ నుంచి మొదలు కాబోతుంది అనే వార్తల నేపథ్యంలో అల్లు అర్జున్-త్రివిక్రమ్ మూవీ కూడా త్వరలోనే స్టార్టవుతుంది అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ముందుగా త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ మూవీ ఉంటుందా? లేదంటే ముందుగా అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్ మొదలవుతుందో అనేది ఏప్రిల్ 8 న క్లారిటి వస్తుంది అంటున్నారు. 

ఏప్రిల్ 8 న అల్లు అర్జున్ బర్త్ డే. ఆ రోజు ఈ రెండు సినిమాల అనౌన్సమెంట్స్ వచ్చేస్తాయి. అప్పటివరకు అల్లు డ్యాన్స్ వెయిట్ చేస్తే సరిపోతుంది. ఆ రోజే త్రివిక్రమ్-అట్లీ మూవీలపై ఫుల్ క్లారిటీ వస్తుంది అనే టాక్ మాత్రం వైరల్ అయ్యింది. 


Allu fans have to wait:

Allu Arjun new movie updates are coming on April 8th





Source link