Donald Trump US Plane Crash : వాషింగ్టన్ డీసీ రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఓ చిన్న విమానం, హెలికాప్టర్ ను గగన తలంలో ఢీకొని పక్కనే ఉన్న పొటోమాక్ నదిలో కుప్పకూలాయి. ఈ ఘటనపై తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ వాన్స్ విచారం వ్యక్తం చేశారు. రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ లో జరిగిన ప్రమాదం గురించి అధికారులు తనకు వివరించారన్నారు. ఈ ఘటనపై అధికారులు వెంటనే స్పందించి పరిస్థితిని పర్యవేక్షించడంపై ఓ ప్రకటనలో స్పందించారు.
ప్రమాదాన్ని నివారించే అవకాశమున్నా చేయలేదని చెప్పారు. మీ ముందు విమానం వస్తోంది కన్పిస్తోందా అని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అడగడానికి బదులుగా ఏం చేయాలో ఎందుకు చెప్పలేదు.. కనీసం అలా చేసి ఉంటేనైనా ప్రమాదాన్ని నివారించేవారేమోనన్నారు. విమానం గురించి అడగటానికి బదులుగా కంట్రోల్ టవర్ ఎందుకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. విమానం సరైన దారిలోనే వెళ్లినా ప్రమాదానికి గురైందని ట్రంప్ తెలిపారు. కాగా ఈ ప్రమాదం అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్, క్యాపిటల్ కు దక్షిణాన కేవలం 3 మైళ్ల దూరంలోనే జరిగింది.
ఈ విమాన ప్రమాదంపై అమెరికన్ ఎయిర్ లైన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. విచిత, కాన్సాస్ (ICT) నుంచి వాషింగ్టన్, డీసీ (DCA)కి వెళ్లే అమెరికన్ ఈగిల్ ఫ్లైట్ 5342 డీసీఏ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ విమానంలో 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. దీనికి సంబంధించి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం అని ప్రకటనలో తెలిపింది. యూఎస్ మీడియా నివేదికల ప్రకారం, అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం సగానికి చీలిపోయి పొటోమాక్ నదిలో పడింది. ప్రయాణికుల కోసం పడవలు, డైవర్లతో సెర్చింగ్ సాగుతోంది. ప్రమాదానికి గురైన బ్లాక్ హాక్ హెలికాప్టర్ కూడా దాని సమీపంలోనే విమానంలో మునిగిపోయింది.
Jan 29: American Airlines plane crashed into a helicopter while landing at Reagan National Airport near Washington, DC – this led to reported fatalities and a search and rescue in the Potomac River – flights at the airport have been halted
— Codey369 (@Codeym369) January 30, 2025
ఈ ఘటనపై యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు: “ఈ సాయంత్రం రీగన్ విమానాశ్రయానికి సమీపంలో జరిగిన విమానం ప్రమాదంపై అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అంతా మంచి జరగాలని ఆశిద్దాం” అని ఎక్స్ లో రాశారు.
Please say a prayer for everyone involved in the mid-air collision near Reagan airport this evening. We’re monitoring the situation, but for now let’s hope for the best.
— JD Vance (@JDVance) January 30, 2025
అయితే ఈ ప్రమాదంలో ఎంత మంది చనిపోయారన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారా? లేదంటే గాయాలతో బయటపడ్డారా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఘటనాస్థలిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పలు ఏజెన్సీలు పాల్గొన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంతో ఎమర్జెన్సీ విభాగం వెంటనే స్పందించి ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలను నిలిపివేసినట్టు విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. పూర్తి సమాచారం కోసం ప్రయత్నిస్తున్నట్టు నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు తెలిపింది.
🚨 #BREAKING: A plane has crashed into a helicopter while landing at Reagan National Airport near Washington, DC
Fatalities have been reported, a MASSIVE search & rescue operation is happening in the Potomac River
Witnesses reported seeing a “massive crash” and hearing a loud… pic.twitter.com/GtSiWjUWn0
— Nick Sortor (@nicksortor) January 30, 2025
ఈ విషయంపై స్పందించిన ఓ సీనియర్ అధికారి.. ఆర్మీ హెలికాప్టర్లో సైనికులు ఉన్నారో లేదో తెలియదన్నారు. కానీ ఇందులో సీనియర్ అధికారులు మాత్రం లేరని చెప్పారు. ఈ హెలికాప్టర్ వర్జీనియాలోని ఫోర్ట్ బెలివర్ బేస్‌కు చెందిందని అన్నారు. ప్రమాదం రాత్రివేళ జరగడంతో ప్రాణనష్టం అధికంగా ఉంటుందని పోలీస్ అధికారులు భావిస్తున్నారు.
Also Read : Airplane Crash : గాలిలో హెలికాప్టర్‌ను ఢీకొట్టి, నదిలో కుప్పకూలిన విమానం – నిలిచిపోయిన విమాన రాకపోకలు
మరిన్ని చూడండి