american 47th President donald trump first reaction after winning in us elections 2024 against kamala harris | Donald Trump News: అమెరికాలో స్వర్ణయుగం చూస్తాం

American News President Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా స్పందించారు. పామ్ బీచ్ కౌంటీ కన్వెన్షన్ సెంటర్‌లో తన మద్దతుదారులతో సమావేశమై ప్రసంగించారు. తన జీవితంలో ఇలాంటి మధుర క్షణాలు ఎప్పుడూ చూడలేదని చెప్పుకొచ్చారు. ప్రజల కష్టాలు తీర బోతున్నాయని చెప్పారు. ఇలాంటి విజయం అమెరికా ప్రజలు ఎప్పుడూ చూడలేదన్నారు. అమెరికాకు పూర్వవైభవం తీసుకొస్తామన్నారు. అమెరికాకు స్వర్ణయుగం మొదలైందని అన్నారు. తన విజయం మెలానియా కీలక పాత్ర పోషించారని కితాబు ఇచ్చారు. స్వింగ్ రాష్ట్రాల్లో ఎక్కువ ఓట్లు వచ్చాయని అన్నారు. పాపులర్ ఓట్లలో కూడా తమదే విజయమన్నారు. సెనెట్‌తోపాటు కాంగ్రెస్‌లో కూడా ఆధిక్యం కనబరిచినందుకు ఆనందం వ్యక్తం చేశారు. 

‘అమెరికాను మళ్లీ గొప్పగా నిలబెడతాం’:ట్రంప్ 
అమెరికా ఎన్నికల్లో విజయం సాధించి 47వ అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్న డొనాల్డ్ ట్రంప్.. అమెరికా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. “ఇలాంటి క్షణాలను ఇప్పటి వరకు ఎప్పుడూ ఎన్నడూ చూడలేదు. మేము దేశ సరిహద్దులను బలోపేతం చేస్తాము. దేశ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తా.”

‘ప్రజలు మాకు చాలా బాధ్యత అప్పగించారు’: డొనాల్డ్ ట్రంప్ 
స్వింగ్ రాష్ట్ర ఓటర్లకు డొనాల్డ్ ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు. మీ కుటుంబం, భవిష్యత్తు కోసం పోరాడుతానని చెప్పారు. స్వింగ్ రాష్ట్ర ఓటర్ల నుంచి కూడా మద్దతు లభించింది. వచ్చే నాలుగేళ్లు అమెరికాకు బంగారుమయం కానున్నాయి. ప్రజలు మాకు చాలా పెద్ద బాధ్యత అప్పగించారు. అని అన్నారు. 

ట్రంప్ తన ప్రసంగంలో తన కుటుంబానికి పిల్లలకు ధన్యవాదాలు తెలిపారు. “ఇది మన దేశం ఇంతకు ముందెన్నడూ చూడని పొలిటికల్ విక్టరీ. గతంలో ఇలాంటిది ఎప్పుడూ లేదు. మీ 47వ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు అమెరికా ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రతి పౌరుడి కోసం నేను పోరాడతాను. మీ కుటుంబం, మీ భవిష్యత్తు కోసం, యావత్‌ శరీరం మీ కోసం పోరాడుతుంది. పిల్లలకు అర్హమైన అమెరికాను అందించే వరకు నేను విశ్రమించను. ఇది నిజంగా అమెరికా స్వర్ణయుగం’’ అని ట్రంప్ అన్నారు.

మరిన్ని చూడండి

Source link