American Dream A Mirage: అమెరికాలో జీవనం సాగించేందుకు జీవితాన్ని,ప్రాణాన్ని పణంగా పెట్టకూడదని కాంగ్రెస్ ఎంపీ, మాజీ భారత దౌత్యవేత్త శశిథరూర్ అన్నారు. ఏబీపీ నెట్ వర్క్ .. ముంబైలో ఐడియాస్ ఆఫ్ ఇండియా ఫోర్త్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది. ఇందులో శశిథరూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా డిపోర్టేషన్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమ వలసదారుల కాళ్లు, చేతులకు సంకెళ్లు వేయడం ..అమెరికా మానవత్వం లేమికి నిదర్శనమన్నారు. ఇతర దేశాలకు వెళ్తేనే ఉపాధి అవకాశాలు బాగుంటాయన్న అభిప్రాయాన్ని చెరిపేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇక్కడే భారత్ లోనే ఎన్నో మెరుగైన అవకాశాలు ఉన్నాయని… అద్భుతమైన జీవన ప్రమాణాలను ఆశించవచ్న్నారు. దేశంలో ఉండటానికి .. మరింత ఉత్సాహకరమైన వాతావరణాన్ని సృష్టించాల్సి ఉందని శశిథరూర్ అభిప్రాయపడ్డారు.
అమెరికాను అద్భుతంగా బావిస్తూ.. భారతదేశంలో చాలా మంది అమెరికాకు వలస పోయేందుకు ప్రయత్నిస్తున్నారు. చదువులు, ఉద్యోగాలకోసం వెళ్తున్నారు. అయితే అమెరికా కంటే భారత్ ఎంతో ఉన్నతమైన అవకాశాలు, మెరుగైన జీవన ప్రమాణాలు ఉన్న దేశంగా మారాల్సి ఉందని థరూర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికా వెళ్తే స్వర్గానికి వెళ్లినట్లుగా భావిస్తూంటారని.. అలాగే అధికంగా డబ్బు సంపాదించుకోవచ్చని. భావిస్తారని అందుకే అమెరికాకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తారన్నారు. బ్రిటిష్ హయాంలో జరిగిన వాటిని శశిథరూర్ సమావేశంలో గుర్తు చేసుకున్నారు.
మన దేశం నుంచి బ్రిటిష్ హయాంలో ఒప్పంద కార్మికులుగాదాదాపు 200 మిలియన్ల మంది భారతీయులను ఒప్పంద కార్మికులుగా విదేశాలకు పంపారని శసిథరూర్ తెలిపారు. వారంతా కలిసి సింగపూర్ ను నిర్మించారన్నారు. ఇలా అనేక దేశాలకు ఒప్పంద కార్మికులాగ ఇతర దేశాలకు వెళ్లిన వారు ఆయా దేశాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఇప్పటికీ అనేక దేశాల్లో భారతీయ మూలాలున్నవాళ్లు కీలక పాత్ర పోషిస్తున్నారని థరూర్ గుర్తు చేశారు.
మేథో వలస అంశంపైనా శశిథరూర్ మాట్లాడారు. సుందర్ పిచాయ్ , సత్య నాదెళ్ల వంటి భారతీయులు మేధో వలసకు ఉదాహరణలన్నారు. ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషన్‌లో దౌత్యవేత్తగా తన కెరీర్‌ను గుర్తు చేసుకున్న ఆయన వలసదారుల ప్రాముఖ్యతను తక్కువ అంచనా వేయలేమన్నారు. సిలికాన్ వ్యాలీలోని ఐటి ఇంజనీర్ల నుండి టొరంటో వీధుల్లో క్యాబ్ డ్రైవర్ల వరకు అందరూ చేసే వృత్తులు, వ్యాపారాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వ వృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇతర దేశాలకు భారత యువత వలస వెళ్లకుండా మరిన్ని మౌలిక సదుపాయాలను సృష్టించాల్సిన అవసరం ఉందని శశి థరూర్ స్పష్టం చేశారు. ప్రస్తుత భారత దేశ అభివృద్ధి చెబుతున్నంతగా లేదన్నారు. ఉదాహరణకు పంజాబ్ నే తీసుకుంటే బ్రెడ్ బాస్కెట్ గా పంజాబ్ ను చెప్పుకుంటూంటే.. అక్కడి నుంచి యువత వలస చాలా ఎక్కువగా ఉందన్నారు.
Also Read: ఎలన్ మస్క్ గురించి గోయెంకాల వారసుడు ఏం చెప్పారంటే
మరిన్ని చూడండి