Anant Ambani Radhikas will get married on July 12 Wedding Card Out

Anant Ambani Radhika Wedding: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ జులై 12వ తేదీన ఒక్కటవ్వనున్నారు. ఈ మేరకు అఫీషియల్‌గా వెడ్డింగ్ కార్డ్‌ని విడుదల చేశారు. ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు ఈ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఇప్పటికే కొంత మంది ప్రముఖులకు అంబానీ ఫ్యామిలీ ఈ వెడ్డింగ్ కార్డులను పంపింది. రెడ్, గోల్డ్ కలర్స్‌తో అందంగా ఈ శుభలేఖని డిజైన్ చేశారు. మూడు రోజుల పాటు ఏమేం వేడుకలు జరుగుతాయో ఆ వివరాలన్నీ కార్డులో ప్రింట్ చేయించింది అంబానీ ఫ్యామిలీ. జులై 12వ తేదీన శుభ వివాహ్‌ కార్యక్రమం జరగనుంది. జులై 13వ తేదీన శుభ్ ఆశీర్వాద్‌ కార్యక్రమం నిర్వహించున్నారు. ఇక వేడుకల్లో చివరి రోజైన జులై 14న మంగళ్ ఉత్సవ్ జరిపిస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ కార్యక్రమాలు జరుగుతాయని అంబానీ కుటుంబం వెల్లడించింది.

క్రూజ్‌లో వేడుకలు..

ఇప్పటికే జామ్‌నగర్‌లో ప్రీవెడ్డింగ్ వేడుకల్ని చాలా గ్రాండ్‌గా చేశారు. ఇప్పుడు రెండోసారి ప్రీవెడ్డింగ్ వేడుకల్ని అంత కన్నా గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. ఓ క్రూజ్‌లో ఈ సెలబ్రేషన్స్‌ జరుగుతున్నాయి. ఇటలీ నుంచి ఫ్రాన్స్‌కి ఈ క్రూజ్ ట్రావెల్ చేయనుంది. ఈ వేడుకలకు బాలీవుడ్ ప్రముఖులకు ఇన్విటేషన్ పంపింది అంబానీ ఫ్యామిలీ. వీళ్లలో షారుఖ్ ఖాన్, రణ్వీర్ సింగ్, కరీనా కపూర్, కరణ్ జోహార్, అనన్యా పాండే, జాహ్నవీ కపూర్, దిశా పటానీ, కరిష్మా కపూర్‌తో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఓరీ కూడా ఉన్నాడు. మార్చిలో జరిగిన ప్రీవెడ్డింగ్ వేడుకల్ని అంబానీ వైల్డ్‌లైఫ్ సాంక్చురీలోని వన్‌తారాలో జరిపించారు. పాప్ సింగర్ రిహానాతో పాటు యాకాన్ కూడా ఈ వేడుకల్లో ప్రదర్శన ఇచ్చారు. అయితే…ప్రస్తుతం క్రూజ్‌లో ప్రీవెడ్డింగ్ వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది. Back Street Boys పాటకు కొందరు స్టెప్పులేశారు. ఈ వేడుకల్లో షకీరా కూడా ఓ ప్రదర్శన ఇస్తుందని చెబుతున్నారు. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.


Also Read: Naveen Patnaik: నేను ఆరోగ్యంగా ఉన్నా, ఓట్ల కోసమే ఈ పుకార్లు – మోదీకి నవీన్ పట్నాయక్ కౌంటర్

మరిన్ని చూడండి

Source link