Animal Movie Overseas Public Talk యానిమల్ మూవీ ఓవర్సీస్ టాక్

బాలీవుడ్ హీరోతో టాలీవుడ్ డైరెక్షన్ తెరకెక్కించిన యానిమల్ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రణబీర్ కపూర్-సందీప్ రెడ్డి వంగా కలయికలో వస్తున్న యానిమల్ మూవీ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పోస్టర్స్ తోనే సినిమాపై అంచనాలను క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా యానిమల్ ప్రమోషన్స్ తోనూ, ట్రైలర్ తోనూ ఆ అంచనాలు రెట్టింపు చెయ్యడమే కాదు.. యానిమల్ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆడియన్స్ ని వెయిట్ చేయించాడు. భారీ అంచనాలు నడుమ నేడు విడుదలైన యానిమల్ మూవీ ఓవర్సీస్ షోస్ ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి.

ఓవర్సీస్ పబ్లిక్ యానిమల్ చూసి ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే చూసేద్దాం.. 

యానిమల్ సినిమా చూశాను. అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా రికార్డులను ఈ చిత్రం బ్రేక్ చేయబోతున్నది.. ఇప్పటివరకు బాలీవుడ్ హీరోలెవరూ సాధించలేని రేర్ ఫీట్ రణబీర్ సాధించబోతున్నాడు అంటూ ఓ నెటిజెన్ కామెంట్ చేసాడు. యానిమల్ చూసాక ఏముందిరా సినిమా అనేలా ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత చాలా రోజులు వెంటాడే సినిమా ఇది. నటనపరంగా రణ్‌బీర్ విశ్వరూపం చూపించాడు, రణ్‌బీర్ కపూర్ ఇంతకు ముందెన్నడూ చూడని అవతారంలో కనిపించాడు. రణ్ బీర్ కెరీర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. పక్కా యాక్షన్ మూవీ. ఈ సినిమాకు రణ్‌బీర్ కపూర్ బ్యాన్ బోన్.. అంటూ మరో ఆడియెన్ ట్వీట్ చేసాడు.

రణ్‌బీర్ కపూర్ యాక్టింగ్ అదిరిపోయింది. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ సూపర్బ్. డైరెక్షన్ బ్రిల్లియెంట్. ఈ సినిమా గురించి చెప్పడానికి మాటలు లేవు. బీజీఎం మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. 1000 కోట్ల కలెక్షన్లు పక్కా, మాస్టర్ పీస్ మూవీ. బంధాలు, అనుబంధాల ఆధారంగా వచ్చిన సినిమాల్లో మైలురాయిగా నిలిచే సినిమా ఇది, ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాకుండా ఈ సినిమాలో అందర్నీ ఆకట్టుకొనే గ్రిప్పింగ్ ఎలిమింట్స్ చాలా ఉన్నాయి, ప్రతీ సీన్ గూస్ బంప్స్. రాగింగ్ ఎపిసోడ్ కేక పెట్టించింది.. అంటూ మరికొందరు మాట్లాడుతున్నారు. 

రణబీర్ మాత్రమే కాదు, బాబీ డియోల్, రష్మిక మందన్న, అనిల్ కపూర్ నటన అద్భుతం, యానిమల్ ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు అంటూ పలువురు ప్రేక్షకులు ట్వీట్లతో యానిమల్ టాక్ ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు.

Source link