Anushka Ghaati first look out భయపెడుతున్న అనుష్క

అరుంధతి, భాగమతి చిత్రాలు తర్వాత అనుష్క మళ్ళి అంతటి ఇంపాక్ట్ ఉన్న మూవీ గా ఆమె క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చేస్తున్న ఘాటి చిత్రం లో ఉంది అనిపించేలాంటి ఫస్ట్ లుక్ ను మేకర్స్ అనుష్క శెట్టి బర్త్ డే సందర్భంగా వదిలారు. 

అనుష్క శెట్టి చాలా యూనిక్ స్క్రిప్ట్‌లని ఎంపిక చేసుకుంటున్నారు. ఒక స్క్రిప్ట్ ని ఎంచుకున్నప్పుడల్లా ప్రాజెక్ట్ చుట్టూ అంచనాలు భారీగా ఉంటున్నాయి. బాహుబలి సిరీస్ మూవీస్ తర్వాత, అనుష్క-క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మ్యాసీవ్ పాన్ ఇండియా మూవీ ఘాటితో రాబోతున్నారు. 

బాహుబలి తర్వాత అనుష్క చేస్తున్న ఈ హై బడ్జెట్ చిత్రంపై కూడా అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈరోజు విడుదలైన ఫస్ట్‌లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు, మేకర్స్ క్వీన్ అనుష్క ఫెరోషియస్ అవాతర్ ని పరిచయం స్పైన్ -చిల్లింగ్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

ఆదివాసీ ప్రజలు తమ వస్తువులన్నింటినీ తీసుకుని కొండపైకి నడుస్తుండతో గ్లింప్స్ మొదలవుతుంది, కార్లలో కొంతమంది వ్యక్తులు ఘాట్ రోడ్లపైకి వస్తారు. తన శరీరం అంతటా ట్రైబల్ టాటూస్ తో, సిటీ బస్సు వైపు కొడవలితో నడుచుకుంటూ వచ్చిన అనుష్క స్టన్నింగ్ ఎంట్రీ అదిరిపోయింది. అనుష్క బస్సులోకి ఎంటరై ఒక వ్యక్తి మెడను నరికి అద్దంలో తనను తాను చూసుకోవడం టెర్రిఫిక్ గా వుంది.

అతని మెడ నరికిన తర్వాత, రక్తం చిందే తలని పట్టుకొని నడుస్తూ, ఆపై పొగ తాగుతున్నట్లు కనిపించిన విజువల్స్ అదిరిపోయాయి. అనుష్క మాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌ టెర్రిఫిక్ గావుంది.  గ్లింప్స్ లోని ప్రతి ఫ్రేమ్‌ అద్భుతంగా వుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరింత ఇంటెన్స్ ని యాడ్ చేసింది.

Source link