AP ఏపీలో వెయ్యి కోట్ల పెట్టుబడి.. !


Tue 30th Apr 2024 01:39 PM

ap  ఏపీలో వెయ్యి కోట్ల పెట్టుబడి.. !


AP ఏపీలో వెయ్యి కోట్ల పెట్టుబడి.. !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు రాష్ట్రంలో కీలక పరిణామామే చోటుచేసుకుంది.! పరిశ్రమలు లేవు.. కంపెనీలు రావట్లేదన్న ప్రతిపక్షాలకు చెంపపెట్టులాగా పావులు కదిపిన వైసీపీ సర్కార్ సక్సెస్ అయ్యింది.! పది కాదు వంద కాదు ఏకంగా వెయ్యి కోట్ల రూపాయిల పెట్టుబడితో కోరమాండల్ ఇంటర్నేషనల్ కంపెనీ పెట్టుబడులు పెడుతోంది. కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీ ఎరువుల తయారీ దిగ్గజం అన్న విషయం తెలిసిందే. కాకినాడలో ఫాస్పరిక్-సల్ఫ్యూరిక్ యాసిడ్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం వెయ్యి కోట్ల రూపాయిలు పెట్టుబడి పెడుతున్నట్లు కోరమాండల్ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణ పనులు ప్రారంభమయ్యామని రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలిపింది.

ఏప్రిల్-26న ప్లాంట్ శంకుస్థాపన జరగ్గా.. కంపెనీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరుణ్ అలగప్పన్ పాల్గొనడం జరిగింది. రూ.1,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నామని.. రెండేళ్లలో ప్రొడక్షన్ మొదలవుతుందని కంపెనీ స్పష్టం చేసింది. కాగా.. రోజుకు 650 టన్నుల ఫాస్ఫరిక్ యాసిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తయారు చేసే ఈ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అడ్వాన్స్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీఏ–హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (డైహైడ్రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎటాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌– హెమిహైడ్రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిల్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ప్రాసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీ, ఆటోమేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీసీఎస్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నిర్మిస్తున్నామని కంపెనీ తెలిపింది. ఇక.. సల్ఫ్యూరిక్ యాసిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  తయారీ కోసం 1800 టీపీడీ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్ ఏర్పాటుతో ఎందరో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించినట్లు అవుతుంది. ఎన్నికల ముందర కూడా ప్రజల కోసం ఆలోచన చేయడం హర్షించదగిన పరిణామమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి. వాస్తవానికి ఎన్నికల తరుణంలో ఓటర్లను ఎలా తమ బుట్టలో వేసుకోవాలని మాత్రమే ప్రభుత్వాలు చూస్తాయి కానీ.. జగన్ మాత్రం పెట్టుబడుల గురించి కూడా ఆలోచిస్తుండటం విశేషమని చెప్పుకోవచ్చు.

ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర, రాష్ట్ర పెట్టుబడుల మద్దతును కూడాకంపెనీ అన్వేషిస్తోంది. ఎరువుల తయారీలో వినియోగించే కీలక ముడి పదార్థాలకు సరఫరా భద్రతను నిర్ధారిస్తుందని కంపెనీ భావిస్తోంది. ఇప్పటి వరకూ కోరమాండల్ కంపెనీ ఏర్పాటు చేసిన ఫాస్ఫటిక్‌ ఫెర్టిలైజర్‌ తయారీలో కాకినాడలో నిర్మిస్తున్నది దేశంలో రెండవ అతిపెద్దది కావడం విశేషమని చెప్పుకోవచ్చు. దీని సామర్థ్యం 20 లక్షల టన్నులు కాగా.. దేశవ్యాప్తంగా తయారవుతున్న నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం ఆధారిత ఎరువుల పరిమాణంలో కోరమాండల్‌ కాకినాడ ప్లాంటు వాటా 15 శాతం ఉంది. కాగా.. ఎన్నికల ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం వైసీపీకి బాగా బూస్టింగ్ ఇచ్చే విషయమే అని చెప్పుకోవాలి. ఇది ముమ్మాటికీ వైసీపీ ఘనతే అని ఆ పార్టీ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నాయి.


AP:

AP





Source link